Sonali Bendre : స్టార్ హీరోయిన్ కోసం అభిమాని సూసైడ్.. షాకింగ్ ఇన్సిడెంట్ రివీల్ చేసిన 'ఇంద్ర' బ్యూటీ!

సోనాలి బింద్రేను చూడలేకపోయినందుకు గతంలో ఓ అభిమాని చెరువులో దూకి సూసైడ్‌ చేసుకున్నారు. దీనిపై తాజాగా ఆమె స్పందించింది. ఇప్పటివరకు నాకు ఈ విషయం తెలియదు. ఇది బాధాకరమైన విషయం. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పు" అని చెప్పింది.

New Update
Sonali Bendre : స్టార్ హీరోయిన్ కోసం అభిమాని సూసైడ్.. షాకింగ్ ఇన్సిడెంట్ రివీల్ చేసిన 'ఇంద్ర' బ్యూటీ!

Sonali Bendre Reveals Shocking Incident : టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్ర (Indra Movie), శంకర్ దాదా MBBS, మన్మథుడు (Manmadhudu) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె చాలా సంవత్సరాల తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్ తో మళ్ళీ వెండితెరపై కనిపించింది. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న సోనాలి ఫ్యాన్ కల్చర్ గురించి మాట్లాడుతూ తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో తన అభిమాని ఒకరు సూసైడ్ చేసుకున్నాడనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

అలా చేయడం తప్పు...

సోనాలి బింద్రేను చూడలేకపోయినందుకు గతంలో ఓ అభిమాని చెరువులో దూకి సూసైడ్‌ చేసుకున్నారు. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ.. ఆ సంఘటనను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పింది." ఇప్పటివరకు నాకు ఈ విషయం తెలియదు. అభిమాన హీరోయిన్‌ను చూడలేకపోయినందుకు ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయం. నాకు కొన్ని మెయిల్స్‌, ఉత్తరాలు వచ్చేవి.

Also Read : ‘కల్కి’ ‘భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో వచ్చేసింది.. పంజాబీ స్టైల్ లో ప్రభాస్ కుమ్మేసాడు!

కొందరు వాటిని రక్తంతో రాసేవారు. అవి చూసి ఆశ్చర్యపోయేదాన్ని. చాలా బాధేసేది. అభిమానించడం తప్పు కాదు. కానీ ఇలా చేయడం తప్పు. మనుషులు తమలాంటి మరో వ్యక్తి కోసం ఎందుకు ఇంతలా తాపత్రయపడతారో నాకు అర్థం కాదు. నేను ఎవరినీ ఈ స్థాయిలో అభిమానించలేదు" అని చెప్పుకొచ్చింది. దీంతో సోనాలి బింద్రే చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు