Ramagundam: సోమారపు సంచలన నిర్ణయం.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు..!

రామగుండం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు సోమారపు సత్యనారాయణ. ఈసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.

New Update
Ramagundam: సోమారపు సంచలన నిర్ణయం.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు..!

Ramagundam Politics: టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ(Somarapu Satyanarayana) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రామగుండం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు సోమారపు సత్యనారాయణ.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ శ్రీ కి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని కోరారు. ప్రధాన పార్టీల నేతల ప్రజలను మోసం చేస్తూ గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. అంతకుముందు గోదావరిఖని పట్టణంలోని ఫైవ్ ఇంక్లైన్ పార్క్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్, అడ్డగుంటపల్లి, గౌతమి నగర్ మీదుగా సాగింది.

రెండుసార్లు రామగుండం ఎమ్మెల్యేగా పని చేసిన సోమారపు సత్యనారాయణ.. 2009లో స్వత్రంత్య అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2014లో బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కోరుకంటి చందర్ పై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కోరుకంటి చందర్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. తదనంతర పరిణామ క్రమంలో కోరుకంటి చందర్.. బీఆర్ఎస్‌లో చేరారు. దాంతో సోమారపు సత్యనారాయణ.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇంతకాలం బీఆర్ఎస్‌లోనే ఉన్న ఆయన.. ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం స్వత్రంత అభ్యర్థిగా పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు.

రామగుండం నియోజకవర్గం..
రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం. ఇది పెద్దపల్లి జిల్లాలోని నియోజకవర్గాలలో ఒకటి. ఇందులో రామగుండం నగరం కూడా ఉంది. ఇది పెద్దపల్లె లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అంతకు ముందు మేడారం (ఎస్సీ) నియోజకవర్గం ఉండగా.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మేడారం రద్దై.. రామగుండం ఏర్పాటైంది. పూర్వ, ప్రస్తుత నియోజకవర్గంలో చూసుకుంటే.. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఇండిపెండెంట్లే గెలుపొందారు. ఇప్పుడు మరోసారి సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

Also Read:

అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్

ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు