CBI : రష్యా కు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్న సీబీఐ.. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయ యువతను ఆకర్షిస్తున్న ట్రావెల్ ఏజెంట్ల పెద్ద ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. By Durga Rao 08 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Indians : రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధ ప్రాంతానికి భారతీయులను అక్రమ రవాణాగా పంపిస్తున్న ముఠా ను సీబీఐ(CBI) అదుపులో తీసుకుంది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి(Contract Employee) సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. వీరిని కేరళలోని తిరువనంతపురం చెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ కేసుపై సీబీఐ అధికారి మాట్లాడుతూ, 'నిందితుడు నిగెల్ జాబీ బెన్సమ్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నాడు. రష్యన్ సైన్యంలో భారతీయ పౌరుల నియామకం కోసం రష్యాలో పనిచేస్తున్న నెట్‌వర్క్‌లో కీలక సభ్యులలో ఒకడు. చెన్నైలో వీసా ప్రక్రియ(Visa Process) పూర్తి చేయడంలో, బాధితులు రష్యాకు వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేయడంలో మైఖేల్ ఆంథోనీ దుబాయ్‌లో ఉన్న తన సహ నిందితుడు ఫైసల్ బాబాకు, రష్యాలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తున్నాడని సీబీఐ ప్రకటన పేర్కొంది. మంగళవారం అరెస్టయిన అరుణ్, ఏసుదాస్ జూనియర్ అలియాస్ ప్రియన్‌లు కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారత పౌరులను రష్యా సైన్యంలోకి చేర్చుకున్న వారిలో ప్రధానులని ఆయన తెలిపారు. Also Read : పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ రాళ్ల దాడి..! మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రష్యాలో అవకాశాలతో భారతీయ యువతను ఆకర్షిస్తున్న ట్రావెల్ ఏజెంట్ల పెద్ద ముఠాను సీబీఐ మట్టుబెట్టిందని, అయితే వారి పాస్‌పోర్ట్‌లను జప్తు చేసి రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్‌లోకి నెట్టారని ఆయన అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌లో 17 వీసా కన్సల్టెన్సీ కంపెనీలు, వాటి యజమానులు మరియు భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఏజెంట్ల పేర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. నేరపూరిత కుట్ర, మోసం మరియు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఏజెన్సీ వారిపై కేసు నమోదు చేసింది. #cbi #contract-employees #russia-ukraine-war #visa-process మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి