సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ లో పొగలు..కారణం ఏంటంటే!

Smoke in Tirupati-Secunderabad Vande Bharat Express: బుధవారం సాయంత్రం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో ఓ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునబోలు సమీపంలోకి రాగానే రైలులోని ఒక బోగీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ లో పొగలు..కారణం ఏంటంటే!

Smoke in Tirupati-Secunderabad Vande Bharat Express : బుధవారం సాయంత్రం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో ఓ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునబోలు సమీపంలోకి రాగానే రైలులోని ఒక బోగీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

తరువాత ఆ మంటలు ఆగిపోయి దట్టమైన పొగ వ్యాపించింది. ఆ పొగ బోగీ మొత్తానికి వ్యాపించింది. దీనిని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే లోకో పైలట్‌ కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేయడానికి సడెన్‌ బ్రేకులు వేశారు. దీంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది.

దీంతో మరోసారి పొగ చెలరేగింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడ్డారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు రైలు కూడా దిగారు. సిబ్బంది రైలు అంతా ఒకసారి పరిశీలించగా ఎవరో బాత్‌ రూమ్‌ లో సిగరెట్ తాగి ఆర్పకుండా పడేశారు.

దాని వలనే మంటలు ఏర్పడి, పొగ వచ్చిందని సిబ్బంది గుర్తించారు. తరువాత పొగలు తగ్గిపోవడంతో రైలు తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. అయితే సిగరెట్ పడేసినట్టుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎప్పుడు ప్రారంభించారు?

అయితే సికింద్రాబాద్‌ - తిరుపతి వందేభారత్ రైలునుఏప్రిల్‌ 8న ప్రారంభించారు. అప్పటి నుంచి రైలు రెండు రాష్ట్రాలకు తిరుగుతుంది. సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుతుంది.

మధ్యలో స్టాపులు:
నెల్లూరులో సాయంత్రం 5 .20, ఒంగోలులో సాయంత్రం 6.30, గుంటూరులో రాత్రి 7.45, నల్గొండలో రాత్రి 10.10కి ఈ స్టాపుల్లో వందేభారత్‌ ఆగుతుంది.

Also Read: మరో వివాదాస్పద బిల్లు? ఈసారి ఏకంగా సీజేఐకే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు