Skin Care: ఈ చిట్కాలతో నల్లటి మోకాళ్ళు, మోచేతులకు గుడ్ బాయ్ చెప్పండి..! చర్మ సంరక్షణ పట్ల అజాగ్రత్త కారణంగా, మోకాళ్లు, మోచేతులు నల్లగా మారడం గమనిస్తుంటాము. అయితే కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ తో ఈ నల్లటి మురికిని తొలగించవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 28 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Get Rid Of Dark Elbows and Knees: ముఖం అందంగా, శుభ్రంగా ఉండడానికి ప్రతిరోజూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మోకాలు, మోచేతుల విషయానికి వస్తే, ప్రజలు వాటిని తరచుగా పట్టించుకోరు. దీని కారణంగా, కొంత సమయం తరువాత, ఈ రెండు భాగాలు పొడిగా, నల్లగా మారుతాయి. ఈ నల్లటి మోకాలు, మోచేతులతో.. మహిళలు షార్ట్‌లు లేదా స్లీవ్‌లెస్ దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడతారు. చర్మ సంరక్షణ పట్ల అజాగ్రత్త కారణంగా మోకాళ్లు, మోచేతులు నల్లగా మారడం జరుగుతుంది. దీని కారణంగా కొంతమంది మొత్తానికే పొట్టి, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించడం మానేస్తుంటారు. అయితే ఈ హోమ్‌మేడ్ లెమన్ స్క్రబ్ తో ఈ సమస్యను సింపుల్ గా పరిష్కరించవచ్చు. ఇంట్లోనే నిమ్మకాయ స్క్రబ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము నిమ్మకాయ స్క్రబ్ (Lemon Scrub) తయారీకి కావలసిన పదార్థాలు బేకింగ్ సోడా - 1/4 కప్పు కొబ్బరి నూనె - 1/4 కప్పు నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్ ఇంట్లో నిమ్మకాయ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో నిమ్మకాయ స్క్రబ్ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె , నిమ్మరసం బేకింగ్ పౌడర్ వేసి ఈ మూడింటిని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌తో మీ మోచేతులు, మోకాళ్లను వృత్తాకార కదలికలో సున్నితంగా స్క్రబ్ చేయండి. మోకాళ్లు, మోచేతులు స్క్రబ్బింగ్ చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడగాలి. నిమ్మకాయ స్క్రబ్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ స్క్రబ్‌లో ఉపయోగించే బేకింగ్ సోడా మృత చర్మ కణాలను తొలగించి చర్మానికి ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మానికి తేమను, పోషణను అందిస్తుంది. అంతే కాకుండా, ఈ స్క్రబ్‌లో ఉపయోగించే నిమ్మరసం చర్మంలోని నలుపును తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఈ స్క్రబ్ స్పెషాలిటీ ఏంటంటే.. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు కూడా దీన్ని తమ చర్మంపై ఉపయోగించుకోవచ్చు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Baby's Skin Care : పిల్లల చర్మ సంరక్షణ విషయంలో ఈ తప్పులు చేయకండి..? - Rtvlive.com #skin-care #beauty-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి