KTR: నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను: కేటీఆర్! రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు. By Bhavana 28 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం నాడు కేటీఆర్ రాజన్న సిరిసిల్ల పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. తనకు ముందుగా సభలోకి అడుగు పెట్టేందుకు అవకాశం ఇచ్చిన సిరిసిల్ల ప్రజల రుణం ఏమిచ్చి తీర్చుకోను అని పేర్కొన్నారు. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేనని వివరించారు. రాజకీయాల్లోకి వచ్చి గెలిచినప్పటి నుంచి కూడా సిరిసిల్లకు ఎంతో చేశాను. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. సిరిసిల్లను సిరుల ఊరుగా మార్చాలని నా కోరిక. పరిశ్రమలను తీసుకుని వచ్చి ఉపాధి అవకాశాలు పెంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలనేది నా సంకల్పమని ఆయన అన్నారు. మరో యాభై సంవత్సరాల పాటు నా పేరు గుర్తుంచుకునేలా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని ఎంతో మందితో పోరాడి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని వివరించారు. కరోనా వల్ల ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు మనకు వృథా అయ్యాయి. అయినా కూడా ఎన్నో అభివృద్ధి పనులను చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరోసారి ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. కరెంట్ లేని మార్పు కావాలా? రైతు బంధు లేని మార్పు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిది కాదు. అది కొత్త పార్టీ కాదు..చెత్త పార్టీ. రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వచ్చి కరెంట్ వైర్లను పట్టుకుంటే తెలుస్తుంది..అది వస్తుందా లేదా అనేది అని ఆయన విరుచుకుపడ్డారు. స్కీంలు పోయి స్కాంలు వచ్చే మార్పు కావాలా, నీళ్లు పోయి కన్నీళ్లు వచ్చే మార్పు కావాలా అని ఆయన అడిగారు. యార్న్ డిపో ని సిరిసిల్లకు తీసుకుని వస్తా..కాటన్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా..కులం మతం కూడు పెట్టదని ఆయన అన్నారు. ఆరు నెలలకో సీఎం అయ్యే మార్పును తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని ఆయన వివరించారు. Also read: ఎన్నికల ప్రచారంలో హూషారెత్తిస్తున్న మంచు మనోజ్..ఎవరికీ సపోర్ట్ ఇస్తున్నాడో తెలుసా! #brs #ktr #elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి