Singareni Elections: సింగరేణి సంస్థలో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ వివరాలివే.. సింగరేణి సంస్థలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర కార్మిక శాఖ సింగరేని సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. By Shiva.K 27 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Singareni Elections Schedule: సింగరేణిసంస్థలో ఎన్నికల నగారా మోగింది. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర కార్మిక శాఖ సింగరేణి సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 6,7 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 10వ తేదీన నామినేషన్ల స్క్రూటిని ఉంటుంది. ఇదే రోజున సింబల్స్ కేటాయిస్తారు. ఇకపోతే.. సెప్టెంబర్ 30వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్‌ను అధికారులు పంపిణీ చేస్తారు. ఓటర్ లిస్ట్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే.. అక్టోబర్ 3వ తేదీ లోపు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలి. 4వ తేదీన వచ్చిన అభ్యంతరాలపై రిటర్నింగ్ అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. 5వ తేదీన ఫైనల్ ఓటర్స్ లిస్ట్‌ను ప్రదర్శిస్తారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు. కాగా, ప్రస్తుతం ఉన్న సింగరేణి సంఘం గుర్తింపు 2019లోనే ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, ఈ అంశంపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు.. అక్టోబర్‌లో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇవాళ కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్యూటీ సీఎల్‌సీ బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఈ సింగరేణి ఎన్నికలు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సింగరేణి ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలివే.. Also Read: Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం! Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా #singareni-elections #singareni-employees #singareni-union మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి