Buckets : బాత్ రూమ్ బకెట్స్ పై జిడ్డు మరకలను ఇలా తొలగించండి

సాధారణంగా ఇంట్లో బాత్ రూమ్ లోని బకెట్లు, ముగ్గుల పై మరకలు మొండిగా మారతాయి. వాటిని తొలగించడానికి డిటర్జెంట్ ఒక్కటే సరిపోదు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మొండి మరకలను తొలగించి వస్తువులను మెరిసేలా చేయవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Buckets : బాత్ రూమ్ బకెట్స్ పై జిడ్డు మరకలను ఇలా తొలగించండి

Bathroom Buckets Hacks : సహజంగా బాత్ రూమ్ లోని బకెట్స్ (Buckets), ముగ్గుల (Mugs) పై మొండి మరకలు (Stains) అలాగే పేరుకుపోవడం గమనిస్తుంటాము. ఈ మరకలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. వీటిని శుభ్రం చేయడానికి డిటర్జెంట్ ఒక్కటే సరిపోదు. ఎందుకంటే ఈ మరకలు చాలా మొండిగా మారుతాయి, అవి సులభంగా తొలగించబడవు. అయితే కేవలం ఇంటి చిట్కాలతోనే వీటిని మెరిసేలా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..

బకెట్, మగ్‌పై నీటి మరకలను శుభ్రపరచడానికి చిట్కాలు

  • బేకింగ్ సోడాను ఉపయోగించడం ద్వారా, పసుపు రంగులోకి మారిన బకెట్ ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ముందుగా ఒక పాత్రలో బేకింగ్ సోడా, డిష్ సోప్, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత, టూత్ బ్రష్ సహాయంతో, ఈ పేస్ట్‌ను బకెట్‌పై అప్లై చేసి బాగా రుద్దాలి. బకెట్ బాగా మురికిగా ఉన్నప్పుడు, పేస్ట్ అప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై రుద్ది శుభ్రం చేయాలి. దీని తర్వాత సాధారణ నీటితో బకెట్ కడగాలి.

publive-image

  • జిడ్డుగా మారిన బకెట్స్, ముగ్గులను మెరిసేలా చేయడానికి వైట్ వెనిగర్ (White Vinegar) సహాయం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీని కోసం, 2 కప్పుల వైట్ వెనిగర్‌తో కొంచెం నీరు కలపండి. ఈ ద్రావణంలో స్పాంజిని నానబెట్టి, బకెట్‌పై పూర్తిగా రుద్దండి. దీని తర్వాత, సాధారణ నీటితో రెండింటినీ శుభ్రం చేయండి.
  • బ్లీచ్ పౌడర్ తో మరింత మెరుగ్గా ఉంటుంది. మొండి మరకలను తొలగించడానికి బ్లీచ్ పౌడర (Bleach Powder) చాలా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి ఉత్తమంగా పరిగణించబడుతుంది. దీని కోసం బ్లీచ్ పౌడర్‌ని ఒక కప్పు నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత బకెట్, మగ్ మీద అప్లై చేయాలి. ఆ పై కొద్దిసేపు బ్రష్‌తో రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.

Hair Care: జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు