Sleep Deprivation: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..!

ఆరోగ్యానికి, శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. మన మెదడు చురుకుగా పనిచేయాలంటే సరైన నిద్ర తప్పనిసరి. నిద్ర మానసిక.. శారీరక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కానీ కొంత మంది ఏదైనా పనిలో ఉండటం, లేదా ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మరికొంత మంది రాత్రిళ్ళు ఫోన్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం.. రోజుకు కనీసం 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే టైపు-2 మధుమేహం, గుండె సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అసలు నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలేంటో చూడండి..

New Update
Sleep Deprivation: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..!

Sleep Deprivation: చాలా మంది ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం, లేదా ఫోన్స్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఈ మధ్య కాలంలో రాత్రి సమయంలో నిద్ర పోకుండా చాలా మంది ఫోన్లు చూస్తూ మేల్కొని ఉంటారు. ఇక్కడ అందరు మర్చిపోతున్న విషయం ఏంటంటే.. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. రోజుకు తప్పక 8 నిద్ర ఉండాలి కానీ కొంత మంది కనీసం 5 గంటలు కూడా పడుకోరు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే  ఆరోగ్యపరమైన సమస్యలేంటో  చూడండి..

నిద్రలేమి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ 

గుండె సంబంధిత సమస్యలు

సరైన సమయం నిద్రలేనందున గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వాళ్ళలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, వంటి సమస్యలు వస్తాయి.

జీవన శైలి వ్యాధులు 

నిద్రలేమితో బాధపడే వాళ్ళలో టైపు-2 డయాబెటిస్, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు నిద్రలేమి కారణంగా మెదడు దెబ్బతిని డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

రోగనిరోధక శక్తి తగ్గడం 

శరీరం చురుకుగా పనిచేయాలంటే నిద్ర చాలా ముఖ్యం.  శరీరానికి కావాల్సిన కంటే తక్కువ నిద్ర ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. దాని వల్ల త్వరగా రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

మెదడు సమస్యలు
బ్రెయిన్ చురుకుగా పని చేయటంలో నిద్ర చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కొన్ని సార్లు సరైన నిద్ర లేనప్పుడు రోజంతా నీరసంగా అనిపించడం, ఏ పని పై శ్రద్ధ పెట్టలేకపోతాము. అందుకే మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. కొన్ని నిద్రలేమి కారణంగా బ్రెయిన్ దెబ్బతిని మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రలేమికి గల కారణాలు ఇవే..

  • పని ఎక్కువగా ఉండటం
  • మధ్య పాన అలవాట్లు
  • మెదడు సంబంధిత వ్యాధులు
  • ఒత్తిడి ఎక్కువగా ఉండటం
  • అదే పనిగా ఫోన్ చూడటం

Also Read: life Style: ఆఫీస్‌లో ఓవర్‌ టైమ్‌ చేస్తున్నారా? మీ చిట్టి గుండెకు ఏం అవుతుందో తెలిస్తే ఫ్యూజులు అవుటే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు