మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశం మంత్రి హరీష్‌రావు ధీమా..!

సిద్దిపేట జిల్లా పాలమాకులలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ తరగతులను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ మహిళలకు అద్భుతమైన అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో 20 నుంచి 30 మంది మహిళలను గుర్తించి కుట్టు మిషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలమాకుల గ్రామంతో మొదలుపెట్టి నియోజకవర్గ పరిధిలోని 5 వేల మంది మహిళలకు కుట్టు మిషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

New Update
మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశం మంత్రి హరీష్‌రావు ధీమా..!

siddipet-district-minister-harish-rao-attend-mahila-kuttu-mission-programme-in-palamakula-village

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. అత్యవసరమైతే రెండవ బ్యాచ్ నిర్వహణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అవివాహితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఉచిత కుట్టుమిషన్‌ శిక్షణ మహిళలకు ఎంతో లాభదాయకమని, అందుకు ప్రతి ఒక్కరూ పక్కాగా కుట్టు మిషన్‌ శిక్షణ పొందాలని, శిక్షణ అనంతరం మీరందరూ స్వశక్తితో ఎదగాలన్నదే మీ అన్నగా నాయొక్క తపన అంటూ మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు.

మహిళలు అన్నిరంగాల్లో పురోగతిని సాధించాలనే ఉద్ధ్యేశంతోనే ఈ బృహత్కర కార్యాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళల పట్ల చిన్నచూపు ఉండకూడదని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. తన నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల సహాయసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. అన్నివిధాల బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళలను ఆదుకుంటుందని.. ఒంటరి మహిళలకు పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని.. సీఎం సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో అన్నిరంగాల్లో పురోగతిని సాధిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు