Tillu Square : 'టిల్లు' గాడు టీవీల్లోకి వచ్చేస్తున్నాడు.. 'టిల్లు స్క్వేర్' టీవీ ప్రీమియర్‌ డేట్ ఇదే..!

సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' మూవీ టీవీలో అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా ఆగస్టు 11న స్టార్ మాలో సాయంత్రం 6 :30 గంటలకు ప్రీమియర్ కానుంది. థియేటర్, ఓటీటీ లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

New Update
Tillu Square : 'టిల్లు' గాడు టీవీల్లోకి వచ్చేస్తున్నాడు.. 'టిల్లు స్క్వేర్' టీవీ ప్రీమియర్‌ డేట్ ఇదే..!

Tillu Square Movie : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన సూపర్ హిట్ సినిమా 'టిల్లు స్క్వేర్' ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ వివరాలు తాజాగా బయటికొచ్చాయి. డీజే టిల్లు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్, మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రూపొందింది. సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తనదైన గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టింది.

ఈ ఏడాది మార్చి చివర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో సైతం మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు టీవీలో కూడా అలరించేందుకు రెడీ అయింది. 'టిల్లు స్క్వేర్' ఆగస్టు 11న స్టార్ మాలో సాయంత్రం 6 :30 గంటలకు ప్రీమియర్ కానుంది.

Also Read : ఓటీటీ కంటే ముందే టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. ఏ ఛానల్ లో టెలికాస్ట్ కానుందంటే..?

థియేటర్, ఓటీటీ లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాకు కొనసాగింపుగా 'టిల్లు 3' రానుంది. వచ్చే ఏడాది పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు