MLC Kavitha: కవితకు ఊరట లభించేది ఎప్పుడో?

TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల  పొడింగించింది. మే 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది.

New Update
MLC Kavitha: కవిత బెయిల్‌ పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల  పొడింగించింది. మే 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇవాళ్టితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వర్చువల్‌గా కవితను కోర్టు ముందు జైలు అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు వివరాలను కోర్టుకు ఈడీ అందజేసింది. 60రోజుల్లో కవిత అరెస్టుపై చార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది.

ALSO READ: సీఎం జగన్‌పై దాడి కేసు.. తీర్పు రిజర్వ్!

ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో తీహార్‌ జైల్‌లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే కేసులో మార్చి 15న ఈడీ, ఈనెల 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీబీఐ కేసులో కవిత బెయిల్‌పై వాదనలు ముగిశాయి. కవిత బెయిల్ పై తీర్పును వచ్చే నెల 2కు కోర్టు రిజర్వ్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు