/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-16.46.15-jpeg.webp)
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకట నారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో క్వాష్ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర బెయిల్ అనేది రెండో అభ్యర్థన అని లూథ్రా తెలిపారు. 17ఏ కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశం ఉందని అభిప్రాయపడ్డారు. జడ్ క్యాటరిగీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని వాదించారు. లూథ్రా వాదనలు విన్న సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.
#BREAKING Supreme Court says it will not restrain the trial judge from dealing with the application seeking police custody of #ChandrababuNaidu.
Court lists Chandrababu Naidu's plea to quash FIR on October 3. https://t.co/ub2RXoBJGw
— Live Law (@LiveLawIndia) September 27, 2023
స్కిల్ డెవల్‌ప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గత శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. దీనిపై నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా సోమవారం సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా.. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం భేటీ అయిన నేపథ్యంలో మిగతా కేసులను రిజిస్ట్రీ లిస్ట్ చేయలేదు. దీంతో ఇవాళ విచారణకు వచ్చింది.