Shobha Shetty: యాంకర్ గా శోభ శెట్టి ఎంట్రీ .. షో పేరు ఏంటో తెలుసా..!

కార్తీక దీపం సీరియల్ ఫుల్ ఫెమసైన శోభ బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ కాఫీ విత్ శోభ అనే షోతో యాంకర్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది.

New Update
Shobha Shetty: యాంకర్ గా శోభ శెట్టి ఎంట్రీ .. షో పేరు ఏంటో తెలుసా..!

Shobha Shetty:  బుల్లి తెర ప్రేక్షకులకు శోభ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో మోనితగా విలన్ పాత్రలో కనిపించి.. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవలే కార్తీక దీపం (Karthika Deepam) సీరియల్ కు బెస్ట్ నెగటివ్ రోల్ క్యాటగిరిలో 'రాష్ట్రీయ గౌరవ్' అవార్డును పొందింది. ఈ సీరియల్ ద్వారా తెలుగులో ఫుల్ పాపులరైన శోభ.. బిగ్ బాస్ సీజన్ 7 లో (Bigg Boss Season 7) కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ లో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గలేదు. తన మాటలు, ఆట తీరుతో లేడీ పటాకా అనిపించుకుంది. తన స్టైల్ లో జెన్యూన్ గా గేమ్ ఆడుతూ బిగ్ బాస్ ఇంట్లో 13 వారాల పాటు కొనసాగింది.

బిగ్ బాస్ తర్వాత శోభ క్రేజ్ మరింత పెరిగింది. షో నుంచి బయటకు వచ్చాక పలు ఇంటర్వూస్, టీవీ షోస్ లో కనిపించి సందడి చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా ఉండే శోభ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

యాంకర్ గా శోభ ఎంట్రీ

బుల్లి తెర సీరియల్ నటిగా ఫుల్ పాపులరైన శోభ.. ప్రస్తుతం సీరియల్స్ కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. తాజాగా ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానెల్ లో వెల్లడించింది. "ఇన్ని సంవత్సరాలుగా సీరియల్స్ చేస్తూ ఉన్నాను.. ఇక ఇప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనీ కొంత కాలం సీరియల్స్ కు బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పింది. సీరియల్ నటిగా కాకుండా.. కొత్తగా కనిపించడానికి యాంకరింగ్ షోకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఒకే చేసినట్లు తెలిపింది ఈ బ్యూటీ". సుమన్ టీవీలో "కాఫీ విత్ శోభ" (Coffee with Shobha) సెలెబ్రెటీ ఇంటర్వ్యూ షో చేస్తున్నట్లు తెలిపింది.

publive-image

కాఫీ విత్ శోభ

తాజాగా ఈ షోకు సంబందించిన ప్రోమోను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. కార్తీక దీపంలో మోనితగా చూశారు.. బిగ్ బాస్ లో శోభ గా చూశారు.. ఇప్పుడు యాంకర్ గా చూస్తారు.. అంటూ 'కాఫీ విత్ శోభ' ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో గెస్టులుగా  బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ, సీరియల్ నటి విష్షు ప్రియా సందడి చేశారు. త్వరలోనే ఈ షో సుమన్ టీవీలో రాబోతున్నట్లు తెలిపింది.

publive-image

Also Read: Devil OTT Release : అప్పుడే ఓటీటీలో కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

#bigg-boss-shobha #shobha-shetty #coffee-with-shobha
Advertisment
Advertisment
తాజా కథనాలు