AP: బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల.. కూటమి ప్రభుత్వంపై ఫైర్!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలేనన్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila : YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది జగన్ .. షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: ఏపీ ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారని.. నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం పై వాగ్ధానం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం విజయవంతం అయిందని..తెలంగాణలో రెండో రోజే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో వచ్చిందని.. కర్ణాటకలో మూడు వారాలకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారని.. మరి చంద్రబాబుకు ఎందుకు ఇంత సమయం పడుతుందో..సమాధానం చెప్పాలన్నారు. ఈ చిన్న పథకంకి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? విధివిధానాలు ఇప్పటి వరకు ఏంటో తెలియదు..బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఇంత ఆలస్యమా ? బస్సులో ఉచితం అని చెప్పడానికి ఇన్ని రోజులా ? ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు ? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అమ్మకి వందనం పథకంపై ఇచ్చిన GO పై క్లారిటీ లేదన్నారు. అమ్మకి ఇస్తారా ? బిడ్డకు ఇస్తారా ? ఇచ్చిన ఉత్తర్వుల్లో అమ్మకి 15 వేలు అని ఉందని అమ్మకి వందనం పథకం పై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15 వేలు ఇవ్వాల్సిందేనన్నారు. జగన్ కూడా ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ అమ్మఒడి పథకం అన్నారు.. కానీ జగన్ ఇచ్చింది ఒక్క బిడ్డకేనని.. మాట ఇచ్చి జగన్ మోసం చేశారని అన్నారు.

Also Read: సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలి: పవన్

'మరోవైపు విశాఖ స్టీల్ పై గందరగోళం సృష్టించారు. అమ్మకం అంటున్నారు..లేదు అంటున్నారు.  ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ను న్యాయం చేసింది కేవలం YSR మాత్రమే.. వైఎస్ఆర్ హయాంలో ఆర్థికంగా సహాయం చేశారు. సొంత మైన్ వైజాగ్ స్టీల్ కి ఉండాలని ప్రయత్నం చేశారు. ఇప్పటి ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ ను కాపాడే ప్రయత్నం చేయలేదు. మొన్న కేంద్ర మంత్రి విచిత్రమైన కామెంట్ చేశారు. ప్రైవేట్ పరం కాకుండా మోడీ తో మాట్లాడుతారట. మోడీతో మాట్లాడటం ఎంటి ? నిజంగా ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారా ? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాత్రి పడిన గుంతలో పగలు పడ్డట్లు ఉంది విశాఖ స్టీల్ పరిస్థితి'.

'మోడీ అంటే ఒక మోసం. తిరుపతి వేదికగా ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ను ఏం చేయాలి అనుకుంటున్నారో చెప్పాలి.  YSR విగ్రహాల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. YSR కి రాజకీయాలు ఎందుకు ఆపాదిస్తున్నారు ?. YSRCP లో వైఎస్ఆర్ ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదు ? ఫీజు రీయింబర్స్ ఎందుకు చెల్లించడం లేదు ? కనీసం పిల్లలకు మంచి ఫుడ్ కూడా పెట్టలేదు. YSRCP కి YSR కి సంబంధం లేదు. YSR కాంగ్రెస్ మనిషి.. కాంగ్రెస్ లోనే బ్రతికాడు ..కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయాడు. అద్భుతమైన పథకాలు YSR కాంగ్రెస్ మ్యాన్ గా అమలు చేశారు. అలాంటి మంచి మనిషి విగ్రహాలు చేయడం కరెక్ట్ కాదు' అని కామెంట్స్ చేశారు.

'ఈ రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలే. అన్ని అక్రమ పొత్తులు, సక్రమ పొత్తులు. బీజేపీ అంటే బాబు, పవన్ ,జగన్. YSR ఫోటో పార్టీలో పెట్టుకుంటే సరిపోదు.. గుండెల్లో ఉండాలి. గుండెల్లో లేదు కాబట్టే ఆయన ఆశయాలను వదిలేశారు. నిజంగా YSR మీద ప్రేమ ఉంటే మొన్న 75 వ జయంతి జరిగింది. నిజంగా ప్రేమ ఉంటే ఏం కార్యక్రమం చేశారు ? ఘాట్ వద్ద 5 నిమిషాలు తూ తూ మంత్రంగా నివాళులు అర్పించారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికలు చంద్రబాబు సీఎం అవ్వాలా? వద్దా అనే కోణం లో జరిగాయి. సీఎం కావాలని అనుకున్న వాళ్ళు కూటమికి వేశారు. సీఎం వద్దు అనుకున్న వాళ్ళు జగన్ కి వేశారు. అంతేగానీ జగన్ మీద ప్రేమ ఉండి కాదు. కేంద్రం వద్ద రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా పై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలి' అని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు