AP : అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు

మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతికి సర్కార్‌ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమెపై కొత్త ఆరు అభియోగాలు నమోదు అయినట్లు తెలుస్తోంది. శాంతి ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ వేయనున్నట్లు సమాచారం.

New Update
AP : అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు

Shanthi : దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి, మదన్‌మోహన్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. తాజాగా, మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలని శాంతికి సర్కార్‌ నోటీసులు ఇచ్చింది. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు సర్వీస్‌ రిజిస్టర్‌లో తన భర్తగా శాంతి మదన్‌మోహన్ (Madhan Mohan) పేరు పేర్కొంది. 2023 ప్రసూతి సెలవుల కోసం అప్లయ్‌ టైమ్‌లో కూడా మదన్‌మోహన్‌ పేరే చెప్పిన శాంతి..17న సుభాష్‌ను పెళ్లిచేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో చెప్పింది.

విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగ ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్న సర్కార్‌..15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి నోటీసులు అందించింది. దేవాదాయ శాఖ ప్రతిష్టకు కలిగిన భంగంపై వివరణ ఇవ్వాలని కమిషనర్‌ సత్యనారాయణ నోటీసుల్లో పేర్కొన్నారు.


ఈ నెల 2న శాంతిని సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే, తాజాగా ఆమెపై ఆరు కొత్త అభియోగాలు నమోదు అయినట్లు తెలుస్తోంది. శాంతి ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ వేయనున్నట్లు సమాచారం.

శాంతిపై కొత్తగా 6 అభియోగాలు

1. విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్‌ అని చెప్పి..వేరొకరిని వివాహం చేసుకోవడంపై
2. కమిషనర్‌ అనుమతి లేకుండా ప్రెస్‌మీట్‌ పెట్టడం
3. దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడంపై
4. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఓ పార్టీకి సపోర్టు చేస్తూ ట్వీట్‌ చేయడంపై..
5. 2022 ఆగస్ట్‌ అరిలోవ పీఎస్‌ నమోదైన కేసుపై వివరణ
6. దేవాదాయ భూముల లీజు 3 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు రెన్యువల్‌ చేయడంపై..

ఇలా శాంతిపై పలు ఆరోపణల నేపధ్యంలో ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలంటూ ఆమె భర్త మదన్‌మోహన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. తన భార్యకు, వైసీపీ (YCP) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) కి వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు.

Also Read: గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్


Advertisment