రీ రిలీజ్ కి రెడీ అయిన మరో మెగా బ్లాక్ బస్టర్.. ఫ్యాన్స్ కి పండగే..! చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటైన 'శంకర్ దాదా MBBS రీ రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 22 చిరు బర్త్ డే కానుకగా ఈ మూవీ రీ రిలీజ్ కానుంది . జీఆర్కే పిక్చర్స్ సంస్థ రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 16 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Shankar Dada MBBS Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్, శర్వానంద్, రోహిత్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాలో చిరంజీవి నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, జయంత్ పరాంజీ దర్శకత్వం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు. ముఖ్యంగా చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సామెతలు చెప్పే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పట్లో ఆడియన్స్ థియేటర్స్ లో రిపీట్ మోడ్ లో చూసిన ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. GET READY FOR MEGA MAGIC!🔥 Megastar @KChiruTweets Garu's iconic film #ShankarDadaMBBS re-releases on Aug 22nd! 🎉 @actorsrikanth @PawanKalyan @iamsonalibendre @ThisIsDSP#PareshRawal #Sharwanand#Vaishanvtej #JayanthCParanjee#AkkineniRaviShankarPrasad pic.twitter.com/CxjWZfMLrb — Matters Of Movies (@MattersOfMovies) August 15, 2024 Also Read : రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఈ సినిమాను ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో 4K క్వాలిటీలో రీ రిలీజ్ చేస్తున్నారు. జీఆర్కే పిక్చర్స్ బ్యానర్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను అత్యధిక సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా ఈ రీ రిలీజ్‌తో థియేటర్లు మ్యూజికల్ కాన్సర్ట్‌లా, కామెడీ కార్నివాల్‌లా మారడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. #megastar-chiranjeevi #shankar-dada-mbbs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి