Shah Rukh Khan : అత్యవసర శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లనున్న షారుఖ్ ఖాన్.. ఆందోళనలో అభిమానులు? బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజాగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ఆసుపత్రిలో కంటి పరీక్షలు జరిపించగా, శస్త్రచికిత్స అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకోసం షారుఖ్ అమెరికా వెళ్తున్నట్టు సమాచారం. By Anil Kumar 30 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజాగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య తీవ్రతరమవడంతో, అత్యవసర శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఒక ఆసుపత్రిలో షారూఖ్ ఖాన్కు కంటి పరీక్షలు జరిపించగా, శస్త్రచికిత్స అనివార్యమని వైద్యులు సూచించారు. అయితే, భారతదేశంలో ఈ శస్త్రచికిత్స చేయించుకోవడానికి బదులు, అత్యుత్తమ చికిత్స కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన అమెరికాకు పయనమయ్యారని తెలిసింది. కాగా ఇది షారూఖ్ ఖాన్కు మొదటిసారి కంటి సమస్య కాదు. గతంలో కూడా ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. 2014 సమయంలో షారూఖ్ ఖాన్ కంటికి సంబంధించిన ఆపరేషన్ చేపించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. Also Read : ధనుష్ రాయన్ పై.. మహేష్ బాబు రియాక్షన్..! సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కంటికి సంబంధించిన సమస్య రావడంతోనే అత్యవసరంగా ఆమెరికా వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, షారూఖ్ ఆరోగ్య పరిస్థితి గురించి మేనేజర్ పూజా దద్లానీ నుంచి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.షారూఖ్ ఖాన్ ఆరోగ్యం గురించి వార్తలు వెలువడగానే, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. #shah-rukh-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి