Trains Cancelled: మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అలర్ట్.. తిరుపతి, నెల్లూరుతో పాటు అక్కడికి వెళ్లే రైళ్లు రద్దు! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి. By Bhavana 04 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు భారీ వర్షం..గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు బయట ఊర్లతో సంబంధాలు తెగిపోయాయి.ఇప్పటికే వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు ప్రకటించారు. Cancellation of Trains pic.twitter.com/JpRBLoj5Cx— South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 మిచౌంగ్ తుఫాన్ కారంణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లలోని 6 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల వద్ద ఒక్కొ పాయింట్ లో కూడా ముగ్గురు టీసీలను రైల్వే యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే ట్రైన్ టికెట్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిఫండ్ చేస్తామని రైల్వే యంత్రాంగం తెలిపింది. Cancellation of Trains pic.twitter.com/JtoUYobINh— South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Also read: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్.. వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం #south-central-railway #cancelled #michaung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి