/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-16T190248.668.jpg)
కెన్యాలో 42 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జోమైసి కలుషా అనే వ్యక్తి 2022 నుండి తన భార్యతో సహా 42 మంది మహిళలను చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. వారిని కిరాతకంగా చంపడమే కాకుండా 9 మంది మహిళల మృతదేహాలను ముక్కలుగా నరికి ఇంటి సమీపంలోని క్వారీలో పడివేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు.హత్యకు గురైన మహిళలంతా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారేనని పోలీసులు వెల్లడించారు. హంతకుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, 10 మొబైల్ ఫోన్లు, గుర్తింపు కార్డులు, మహిళల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. క్వారీలో మృతదేహాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.