Peddapalli: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గుండు గీసి, మీసాలు తొలగించి

రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్‌లో జూనియర్ మెడికో విద్యార్థులపై పలువురు సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. గుండుచేసి మీసాలు తొలగించగా భయంతో జూనియర్లు కాలేజీ వదిలి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

New Update
Peddapalli: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గుండు గీసి, మీసాలు తొలగించి

Godavarikhani: పెద్దపెల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాల (Medical college) బాయ్స్ హాస్టల్‌లో జూనియర్ మెడికో స్టూడెంట్‌ను పలువురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. సంఘటనపై హాస్టల్‌లో గొడవ జరగడంతో పోలీసులు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. జూనియర్ మెడికో తల వెంట్రుకలు, మీసాలను ట్రిమ్మర్ తో ఇష్టానుసారంగా కట్ చేసి, ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత స్టూడెంట్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.సీనియర్ విద్యార్థులు ఇద్దరు జూనియర్ విద్యార్థులకు గుండు చేశారు. మీసాలు తొలగించారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థి కాలేజీ నుంచి వెళ్లిపోగా మిగతా జూనియర్ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

గుండు కొట్టి, మీసాలు తొలగించి..
అర్ధరాత్రి జూనియర్ల హాస్టల్ రూమ్ లలోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండు కొట్టి, మీసాలు తొలగించారు. దీంతో భయాందోళనకు లోనైన ఆ విద్యార్థులు తెల్లారి ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఆగడాలతో విసిగిపోయిన జూనియర్ విద్యార్థులు మంగళవారం కాలేజీలో ఆందోళన చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు బైఠాయించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. రామగుండం మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ, కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు విద్యార్థుల గదుల్లోకి సోమవారం రాత్రి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు. జూనియర్లను ప్రశ్నలతో వేధిస్తూ జుట్టు అంతలా ఎందుకు పెంచారని నిలదీశారు. అనంతరం ట్రిమ్మర్ తో గుండు చేసి, మీసాలు కూడా తొలగించారు. వారితో పాటు మరో ముగ్గురు విద్యార్థులను కూడా ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని ఫోన్ లో తమ తల్లిదండ్రులకు వివరించిన బాధిత స్టూడెంట్లు.. ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేస్తున్న ఆగడాలతో విసిగిపోయిన జూనియర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్‌ విద్యార్థులను తాము ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటామని, వారిని సార్‌, మేడం అని పిలిచినప్పటికీ తమను ర్యాగింగ్‌ చేయడం సరికాదన్నారు.

ఇది కూడా చదవండి : Crime: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

జూనియర్‌ విద్యార్థుల నిరసన..
విషయం తెలుసుకున్న గోదావరిఖని వన్‌టౌన్‌ ఎస్‌ఐ శరణ్య కళాశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. జూనియర్లను విచారించారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థులు ప్రిన్సిపాల్‌ హిమబిందుకు ఫిర్యాదు చేశారు. కళాశాలలో ర్యాగింగ్‌ భూతాన్ని తరమిరికొట్టాలని జూ నియర్‌ విద్యార్థులు నిరసనకు దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై జూనియర్‌ విద్యార్థులు ఫిర్యాదు చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారిపై క్రమశి క్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్‌ హిమబిందు పేర్కొన్నారు. ర్యా గింగ్‌పై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు