Jaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా?

మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.

New Update
Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి

Jaggareddy: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని రేవంత్ చేశాడని.. కేటీఆర్‌, హరీష్ రావుకు సిగ్గనిపిస్తాలేదా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. కోదండరాంను ఎమ్మెల్సీగా అమోదించినందుకు.. గవర్నర్‌ను కాంగ్రెస్ తరపున అభినందిస్తున్నానని తెలిపారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. కేసీఆర్, హరీష్ రావులు.. ఈ నిర్ణయం పట్ల గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలపాలన్నారు.

తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతది.. తాము దాదాగిరి చేస్తే తట్టుకోలేవని హెచ్చరించారు. బీజేపీతో ఫెవికాల్ బంధం కేసీఆర్‌దా.. కాంగ్రెస్‌దా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసునని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం.. భీష్మ పాత్ర పోషించారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు.. ఈ రోజు కోదండరాం ఎమ్మెల్సీ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో వారు కోదండరాన్ని దేవుడిలా భావించి కాళ్లు మొక్కారని.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించిందని..లబ్ది పొందింది మాత్రం మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పోరాటంలో భాగంగానే సమిష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పాడిందన్నారు. పెద్ద మనిషిగా ఆరోజు జేఏసీ చైర్మన్ కోదండరాంను పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: అమ్మకాల్లో గ్రాంట్ విటారాను వెనక్కి నెట్టేసిన ఫ్రాంక్స్ …కేవలం పది నెలల్లోనే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు