Sonali Bendre : నాకు డ్యాన్స్ రాకపోతే డైరెక్టర్స్ తిట్టేవాళ్ళు.. భరించలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నా : సోనాలి బింద్రే

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

New Update
Sonali Bendre : నాకు డ్యాన్స్ రాకపోతే డైరెక్టర్స్ తిట్టేవాళ్ళు.. భరించలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నా : సోనాలి బింద్రే

Sonali Bendre Interview : టాలీవుడ్(Tollywood) లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే(Sonali Bendre). ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్ర, శంకర్ దాదా MBBS, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె చాలా సంవత్సరాల తర్వాత 'ది బ్రోకెన్ న్యూస్' అనే సిరీస్ తో మళ్ళీ వెండితెరపై కనిపించింది. ఇప్పుడు అదే సిరీస్ కి కొనసాగింపుగా 'ది బ్రోకెన్ న్యూస్ 2' రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రే తన సినీ కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నాకు పెద్దగా డ్యాన్స్ రాదు..

" అప్పట్లో డ్యాన్స్ రాకపోతే ఇండస్ట్రీ లో రాణించలేం అనే అభిప్రాయం అందరిలో ఉండేది. నేను ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చే సమయంలో నాకు పెద్దగా డ్యాన్స్ రాదు. నాకు డ్యాన్స్ లో సరిగ్గా నైపుణ్యం లేదని మొదట్లో ఎంతో మంది దర్శకులు తిట్టేవారు. దాంతో అది భరించలేక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డ్యాన్స్ లో శిక్షణ తీసుకునేదాన్ని" అని అన్నారు.

ఆ టైం లో ఇండస్ట్రీ ని వదిలి వెళ్లాలనుకున్నా..

" మణిరత్నం సర్ 'బొంబాయి' మూవీలోని 'హమ్మా హమ్మా' సాంగ్ లో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నాకు కేవలం ఐదు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరంతో కలిసి ఆ పాటకి ఎలాగైనా బాగా పెర్ఫామ్ చేయాలి అనుకున్నా. అప్పటికీ నా పెర్ఫార్మెన్స్ ఎవరికీ నచ్చకపోతే బ్యాగ్ సర్దుకొని ఇండ్రస్ట్రీ వదిలి వెళదాం అని అనుకున్నా" అని చెప్పింది.

ఆ బాధ ఇప్పటికీ ఉంది..

" బొంబాయి సినిమాలో నేను భాగం కాకపోయినా నాకు 'హమ్మా హమ్మా' సాంగ్ మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అది నా పాటగానే మారు మోగిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ ఇలాంటి సాంగ్స్ ఎందుకు చేయలేకపోయానే అనే బాధ ఇప్పటీకీ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : ‘ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేసావ్?’ ‘బిగ్ బాస్’ నటికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్ అదుర్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు