Raghu Babu : నటుడు రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా? చూస్తే ఫిదా అవ్వాల్సిందే! రఘుబాబు ఓ ఈవెంట్ లో ఏకంగా తమిళ పాట పాడాడు. అచ్చం ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఎలా ఉంటుందో అలా తమిళ్ సాంగ్ పాడుతుంటే ఆ ఈవెంట్ లో ఉన్నవాళ్ళంతా మైమరచిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Anil Kumar 15 May 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Senior Actor Raghu Babu Singing Video : ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ రఘుబాబు(Raghu Babu) గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పటి నటుడు గిరిబాబు(Giri Babu) కొడుకైన రఘుబాబు మొదట వర్షం, దిల్ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో అలరించి ఆ తర్వాత కమెడియన్(Comedian) గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈయనకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రఘుబాబు టాలెంట్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? Also Read : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్? రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా? సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న రఘుబాబులో సింగింగ్ టాలెంట్(Singing Talent) కూడా ఉంది. తాజా వీడియోతో ఇది బయటకొచ్చింది. రఘుబాబు ఓ ఈవెంట్ లో ఏకంగా తమిళ పాట పాడాడు. అచ్చం ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఎలా ఉంటుందో అలా తమిళ్ సాంగ్ పాడుతుంటే ఆ ఈవెంట్ లో ఉన్నవాళ్ళంతా మైమరచిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రఘుబాబు సింగింగ్ టాలెంట్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతూ... రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా?, రఘుబాబు అచ్చం ప్రొఫెషనల్ సింగర్ మాదిరి సన్గ్ అద్భుతంగా పాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కళ్ళు మూసుకుని వింటే ఎవరో ప్రొఫెషనల్ సింగర్ పాడారనిపిస్తది. రఘుబాబుగారు 👌👌🎵🎶 pic.twitter.com/2N4trQQaxu — Harish R.M (@27stories_) May 14, 2024 #actor-raghu-babu-singing #senior-actor-raghu-babu #comedian #tollywood-actor సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి