YCP Seediri Appalaraju 'అలాంటి వారు మాత్రమే పార్టీని వీడుతున్నారు'..మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు..!

పదవులంటే అత్యాశ కలిగిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. తాము గెలుస్తాం అని అనుకుంటేనే టికెట్ ఇవ్వమని తాము అన్నామని వెల్లడించారు. తాను గెలవడం ముఖ్యం కాదని.. జగన్ సీఎం కావడం అవసరం అని కామెంట్స్ చేశారు.

New Update
YCP Seediri Appalaraju 'అలాంటి వారు మాత్రమే పార్టీని వీడుతున్నారు'..మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు..!

Seediri Appalaraju Comments: అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పలు సీట్లలో సిట్టింగ్ లను మార్చి వేరే వారిని సమన్వయకర్తలుగా నియమించడంతో టికెట్ దక్కని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి షర్మిలకు జై కొట్టారు. వైజాగ్ కు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిపోయారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు కూడా జనసేన అధినేత పవన్ ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే అదనుగా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లపై స్థానిక నేతలు. ఆశావహులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు.

Also Read: వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే రాజీనామా చేస్తా.!

ఇందుకే పార్టీ మారుతున్నారు..

అయితే, పార్టీ మారుతున్న వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. పదవులంటే అత్యాశ కలిగిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాను గెలవడం ముఖ్యం కాదని.. జగన్ సీఎం కావడం అవసరం అని వ్యాఖ్యనించారు. అన్ని రంగాలవారు బాగుపడాలి అంటే జగన్ సీఎం కావాలని కోరారు. మేము గెలుస్తాం అని అనుకుంటేనే టికెట్ ఇవ్వమని అన్నామని వెల్లడించారు.

జగన్ సీఎం కావడం అవసరం

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సాహించాడని..పేద వర్గాలను వేరు చేశాడని ఆరోపించారు. ఆధునిక అంటరానితనం పోయి..సమసమాజం నిర్మాణం కావాలంటే జగన్ సీఎం కావడం అవసరం అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం కావాలని భువనేశ్వరి యాత్ర చేస్తే ఒరిగేది ఏంటి..? రాజకీయాల్లో ఆమెకున్న ప్రాదాన్యత ఏమిటి..? అని ప్రశ్నించారు. బాబు జైలులో ఉన్నప్పుడు డ్రామాలు చేశారని..జైలు నుండి బయటకు వచ్చాక ఆపేసారని అని కౌంటర్లు వేశారు.

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా..వైసీపీ పార్టీ నుండి ఎవరు వెళ్లినా వైసీపీకి ప్రజల్లో ఉన్నా ఆధారణ తగ్గదని ధీమ వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ సీఎం అవుతారని వ్యాఖ్యనించారు. వై నాట్ 175 అనే నినాదంతో విజయం సాధిస్తామని వ్యాఖ్యనించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు