Breaking : ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపువచ్చింది. ఆ హోటల్ తో పాటు చుట్టు ఉన్న పరిసరాలు కూడా నిత్యం చాలా రద్దీగా ఉంటుండడంతో పోలీసు అధికారులతో పాటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. By Bhavana 28 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Alpha Hotel : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) దగ్గరలో ఉన్న ఆల్ఫా హోటల్(Alpha Hotel) కు బాంబు బెదిరింపు(Bomb Threat) వచ్చింది. ఆ హోటల్ తో పాటు చుట్టు ఉన్న పరిసరాలు కూడా నిత్యం చాలా రద్దీగా ఉంటుండడంతో పోలీసు అధికారులతో పాటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి 10. 45 గంటలకు 100 కి ఫోన్ చేసి హోటల్లో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. బెదిరింపు అందుకున్న వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వెంటనే హోటల్ సిబ్బందిని బయటకు పంపేసి ఖాళీ చేయించారు. రెండు గంటల పాటు హోటల్ లో తనిఖీలు చేపట్టారు. కానీ చివరకు హోటల్ లో బాంబు లేదని బాంబ్ స్క్వాడ్(Bomb Squad) చెప్పారు. దీంతో ఆ ఫోన్ కాల్ ఎవరో ఆకతాయి చేసిందని నిర్ధారించారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని ఖమ్మం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుణ్ని వెంటనే పట్టుకుంటామని డీసీపీ సుబ్బారాయుడు, ఏసీపీ శివమర్తి తెలిపారు. Also read: బీఆర్ఎస్ ఆఫీసులో కూల్చివేతలు! #hyderabad #secunderabad-railway-station #bomb-treat #alpha-hotel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి