Seapage in Tunnel: దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగం ప్రారంభించిన 2 నెలల్లోనే లీకేజీ!

దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగ మార్గం ముంబయి కోస్టల్ టన్నెల్ లీక్ అవుతోంది. లీక్ అవడానికి కారణాలు వెతికే పనిలో ఇంజనీర్లు పడ్డారు. ఇక టన్నెల్ లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పరిశీలించారు. ఈ టన్నెల్ ప్రారంభించి రెండునెలలే అయింది. 

New Update
Seapage in Tunnel: దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగం ప్రారంభించిన 2 నెలల్లోనే లీకేజీ!

Seapage in Tunnel: దేశంలోని వాణిజ్య నగరమైన ముంబైలో ప్రారంభించిన 2 నెలల్లోనే దేశంలోని మొట్టమొదటి సముద్రగర్భ కోస్టల్ టన్నెల్ లీక్ అవుతోంది. ఈ టన్నెల్ 12.19 మీటర్ల పొడవుతో తీర సొరంగం సముద్రంలో 17 - 20 మీటర్ల మధ్య డబుల్ రోడ్డుతో  ఉంది. పనులు పూర్తి చేసి 3 నెలలు కావస్తున్నా రెండు నెలల క్రితమే ప్రారంభోత్సవం చేశారు.

Seapage in Tunnel: ఈ సొరంగ మార్గాన్నిమార్చి 11న ప్రారంభించగా ఒకవైపు రోడ్డు మాత్రమే వినియోగంలో ఉంది. ప్రారంభించినప్పటి నుండి ఈ రోడ్డుపై దాదాపు 7 లక్షల వాహనాలు ప్రయాణించాయి. సోమవారం నుంచి టన్నెల్‌లో లీక్‌ జరగడంతో ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వేసవి కాలంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు సొరంగం లీకేజీ అవుతుండగా, రుతుపవనాలు ప్రారంభమైతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.

Also Read: మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు 

Seapage in Tunnel: సొరంగం లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. లీకేజీపై విచారణకు కూడా ఆదేశించారు. సొరంగంలో రెండు, మూడు వైపులా లీకేజీలు వస్తున్నాయి. లీకేజీకి గల కారణాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

ఆదివారం నుంచీ..
Seapage in Tunnel: ఆదివారం ఉదయం నుంచి లీకేజీలు కొనసాగుతున్నాయని కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గిరీష్ నికమ్ వెల్లడించారు. “నిర్మాణ జాయింట్ల ద్వారా వస్తున్న గోడలో తేమ ఉంది. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఉండడంతో మేము ఇంకా తనిఖీ చేయలేదు.  ఇది ఎందుకు జరుగుతుందో మాకు ఖచ్చితంగా తెలియదు. లీక్‌ను అదుపులోకి తీసుకురావడానికి మేము కొంత గ్రౌటింగ్ చేస్తాము. ” అంటూ చెప్పారు. టన్నెల్‌ను కలిపే జాయింట్లు ఉన్నందున ఈ చిన్న లీకేజీలు సంభవించాయని, అయితే ఖచ్చితమైన కారణాన్ని గుర్తించాల్సి ఉందని నికమ్ చెప్పారు. ఆదివారం ఉదయం మొదట లీక్ కనిపించడంతో, దానిని ఆపడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, సోమవారం లీకేజీలు ఎక్కువయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు