ఆంధ్రప్రదేశ్ AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్ మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Alert For AP: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్ ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంపై ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Doctor Radha Murder Case: పక్కా ప్లాన్ తో భార్యను హత్య చేసిన డాక్టర్.. ఆస్తి వివాదాలే కారణం! గత మూడు నెలలుగా భార్య రాధను చంపేందుకు మహేశ్వర్ రావు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే గత నెల 25న సాయంత్రం ఆస్పత్రి భవనం రెండో ఫ్లోర్ లో ఒంటరిగా ఉన్న రాధ దగ్గరకు లోక్ నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా.. భర్త రెంచ్ సహాయంతో తలపై దాడి చేశాడు. దీంతో డాక్టర్ రాధ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులకు ఆధారలు దొరక్కుండా.. అక్కడ కారం పొడి చల్లారు. ఆ తర్వాత ఏమాత్రం డౌట్ రాకుండా దొంగతనం జరిగినట్టు భార్య నగలు, డబ్బు ఎత్తుకెళ్లినట్టు చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేయగా.. భర్తపై అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బటయ పెట్టాడు. దీంతో డాక్టర్ మహేశ్వర్ రావును, డైవర్, అటెండర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Minister Ambati Rambabu: లోకేష్ రాజకీయ బఫూన్.. నాగురించి మాట్లాడే స్థాయి లేదు: మంత్రి అంబటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పైశాచికాచినందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. నా గురించి విమర్శలు చేసే స్థాయి లోకేష్ కు లేదన్నారు మంత్రి అంబటి. లోకేష్ రాజకీయ బఫూన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులు అనమంటే బీసీ చౌదరిలు అంటున్నాడని.. వైశ్యులను వైశాలి అంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ దిగజారుడు విమర్శలు చేస్తున్నాడని తీవ్రంగా మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నేను పండుగ సమయంలో డాన్స్ చేశా అయితే ఇప్పుడు ఏంటి? నేను మాట్లాడటం మొదలు పెడితే మీరంతా ఏడుస్తారు అంటూ ధ్వజమెత్తారు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varahi Yatra: సీఎం జగన్.. ఓ మూలన కూర్చోలేరా?: పవన్ Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు. శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. డోలిలో ఆస్పత్రికి వెళ్తూ గర్భణి మృతి!! అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళకి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు డోలీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామం నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లాలంటే 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈక్రమంలో పురిటి నొప్పులు మరికాస్త ఎక్కువై.. మహిళ దారిలోనే మరణించింది. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Angallu Clashs Case: అంగళ్లు ఘర్షణ కేసు: దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కి హైకోర్టులో ఊరట చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో తెలుగు దేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర్ రావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ఆంధ్ర ప్రదేశ్ కోర్టులో ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. వీరిరువురి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం విచారణ జరిగింది. వీరి తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. అయితే తమకు వివరాలు అందించేందుకు సోమవారం వరకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో దేవినేని ఉమ, నల్లరి కిషోర్ లకు సోమవారం వరకు ఊరట లభించింది. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: కేసుల్లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.. విడుదల చేయిస్తానని భరోసా! అన్నమయ్య జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు కేసులు నమోదు చేసిన బాధిత కుటుంబాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, పార్టీ పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని స్పష్టం చేశారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే బయటకు తీసుకువస్తామని వెల్లడించారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu :'అమ్మా రేణూ మీ మాజీ'కి చెప్పు.. రేణుదేశాయ్ కి మంత్రి అంబటి కౌంటర్ సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn