Teacher : గురువుగారి భార్యతో శిష్యుడి రాసలీలలు.. చివరకు అలా!

ప్రేమ వ్యవహారం కారణంగా ఈ పాపులర్ గాయకుడు అపఖ్యాతి పాలయ్యాడు. ఇతను ప్రేమ కోసం హద్దులు కూడా దాటిపోయారని చాలా మంది అంటుంటారు.ఏకంగా విద్యనేర్పిన గురువు భార్యనే ప్రేమించాడు ఆ వ్యక్తి. అతనెవరో చూసేయండి.

New Update
Teacher : గురువుగారి భార్యతో శిష్యుడి రాసలీలలు.. చివరకు అలా!

Singer : తన గాత్రంతో ప్రజల్లో ఒక భిన్నమైన స్థానాన్ని పొందిన ప్రసిద్ధ భారతీయ గాయకులలో(Indian Singers) ఒక గాయకుడుగా కీర్తించడబడ్డాడు అతడు. సంగీత దర్శకుడిగా, స్వరకర్తగా, గాయకుడిగా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆయన.. తన పాటలలతో మైమరచిపోయేలా చేసేవారు. అతను సినిమాలకు పెద్దగా పాడలేదు, కానీ వందలాది ప్రత్యక్ష సంగీత కచేరీలు చేశాడు. అతని ఆల్బమ్‌లతో ప్రజల హృదయాలను గెలిచాడు. అయితే ఈయన గజల్(Ghazal) గాయకుడిగా కాకముందు తబలా వాద్యకారుడిగా పేరు తెచ్చుకున్నారు. లెజెండరీ సింగర్స్ కోసం తబలా వాయించేవాడు, వివిధ దేశాల్లో వారితో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇప్పించేవాడు. ఈ గాయకుడు తన సొంత గురువైన అనూప్ జలోటా(Anup Jalota) భార్యను పెళ్లి చేసుకున్నాడు.

రూప్ సింగ్ రాథోడ్.. తన గాత్రంలో ‘ఏ జాతే హుయే లమ్హో..’, ‘సాడే సే ఆతే హై..’, ‘సావ్రే-సావ్రే..’, ‘బర్సాత్ కే మౌసమ్ వంటి అనేక హిట్ పాటలను అందించాడు. రూప్ సింగ్ రాథోడ్, ప్రముఖ సంగీత ద్వయం నదీమ్-శ్రవణ్, నేపథ్య గాయకుడు వినోద్ రాథోడ్, శ్రవణ్ రాథోడ్‌ల సోదరుడు. అయినప్పటికీ అతను తన సోదరుల నుండి సహాయం కోరలేదు. అనూప్ జలోటా ఆయన్ను ఇండస్ట్రీ నుండి తరిమికొట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడని మీకు తెలుసా, కానీ అతను ఇంకా తన గానంతో ప్రజల హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు.

Also Read : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ!

రూప్, అనూప్ జలోటా నుండి సంగీతంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకునేవాడు. తన కెరీర్ ప్రారంభంలో, రూప్ కుమార్ రాథోడ్ హిందీ ప్రసిద్ధ భజన్ గాయకుడు అనూప్ జలోటా బృందంలో పనిచేశాడు. తన గురువు అనుప్ జలోటా నుండి సంగీతంలో సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా, రూప్ కుమార్ స్వయంగా ప్రదర్శనలు ఇచ్చేవాడు. రూప్ కుమార్ అనుప్ జలోటా బృందంలో పనిచేసేటప్పుడు. రూప్, అనూప్ జలోటా భార్య సోనాలి సేత్‌తో స్నేహం చేశారు. కొంతకాలం తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది.రూప్ కుమార్ రాథోడ్ కూడా 1984 సంవత్సరం వరకు అనూప్‌తో కలిసి సంగీత బృందంలో భాగమయ్యాడు. అనూప్ బృందంలో రూప్ కుమార్ తబలా వాయించేవాడు. 1984లో అనూప్ జలోటాకు అమెరికాలో షో చేయమని ఆహ్వానం అందింది.

నూప్ జలోటా తన భార్య సోనాలిని కూడా తనతో పాటు రమ్మని కోరాడు. కానీ, సోనాలి అమెరికా వెళ్లేందుకు నిరాకరించింది. రూప్ కుమార్‌తో సోనాలికి ఉన్న అనుబంధమే ఇందుకు కారణం. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మరోవైపు అనూప్ జలోటా అమెరికా(America) వెళ్లగా మరోవైపు సోనాలి, రూప్ కుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయారు.ఈ వార్త తెలియగానే షాక్ అయ్యాడు అనూప్ జలోటా. ఇక రూప్ కుమార్‌కు ఎలాంటి పని రాకుండా చూసేందుకు అనుప్ జలోటా చాలా ఏళ్లుగా ప్రయత్నించాడని టాక్. అయితే, అనూప్ చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు.దాదాపు 4 ఏళ్ల పాటు తమ ప్రేమను దాచుకుని.. వీరిద్దరూ 1989లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ఎఫైర్‌కు సంబంధించిన వార్తలు మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచిపోయాయి. 1989లో, రూప్ కుమార్ రాథోడ్, సోనాలి సేథ్(Sonali Seth) వివాహం చేసుకున్నారు. దీంతో ఇక ఈ వార్తలకు తెరపడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు