Sarkaaru Noukari Review: సర్కార్ నౌకరి మూవీతో సింగర్ సునీత కొడుకు హీరోగా మెప్పించాడా ?

Sarkaaru Noukari Review:వారసులు సినీ పరిశ్రమలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా సర్కారు నౌకరి మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జనవరి ఫస్ట్ న రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది ?

New Update
Sarkaaru Noukari Review: సర్కార్ నౌకరి మూవీతో సింగర్ సునీత కొడుకు హీరోగా మెప్పించాడా ?

Sarkaaru Noukari Review In Telugu:వారసులు సినీ పరిశ్రమలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది.ఇలా టాలీవుడ్ నుంచి ఎందరో వారసులు వచ్చారు. ఈ క్రమంలోనే సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా సర్కారు నౌకరి మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జనవరి ఫస్ట్ న రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది ?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా

Sarkaaru Noukari తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయిన(Singer Sunitha) సింగర్ సునీత కుమారుడు (Akash Goparaju )ఆకాష్ గోపరాజును హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. కొత్త దర్శకుడు (Gangamoni Sekhar) గంగనమోని శేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం (Sarkaaru Noukari సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K.Ragavendrarao) ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 కొత్త సoవంత్సరానికి శుభారంభం పలుకుతూ జనవరి ఫస్ట్ న విడుదలైన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. సరిగ్గా మూడ్రోజుల క్రితం (Anchor Suma ) యాంకర్ సుమ కుమారుడు హీరోగా పరిచయమవ్వగా.. ఇప్పుడు సింగర్ సునీత కొడుకు ప్రేక్షకుల్ని హీరోగా పలకరించడం ఓ ప్రత్యేకది అని చెప్పాలి. మరి.. ఈ కొత్త కుర్రాడు ఆకాష్ గోపరాజు “సర్కారు నౌకరీ” తో మెప్పించాడా ? లేదా ? ఓ సారి చూద్దాం .

గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ

చిత్ర కథ విషయానికి వస్తే .. మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు గోపాల్ (ఆకాష్ గోపరాజు). ఇష్టపడి పెళ్లి చేసుకున్న సత్య (భావన)తో ఊర్లో చాలా హుందాగా బ్రతుకుతుంటాడు.
అయితే.. గోపాల్ ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు.. ఆ మండలంలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా అందరినీ జాగ్రత్తపరచాల్సిన బాధ్యత అతడిది. దాంతో ఊరంతా అతడ్ని తక్కు చేసి చూడడాన్ని, అసభ్యంగా అతడితో వ్యవహరించడాన్ని భార్య సత్య తట్టుకోలేకపోతుంది. ఒకానొక సందర్భంలో సర్కారు నౌకరి కావాలో, నేను కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారీ చేస్తుంది. అసలు గోపాల్ ఉద్యోగం విషయంలో ఎందుకని అంత పట్టుబట్టి కూర్చున్నాడు? ఈ సర్కారు నౌకరీ వల్ల అతనికి ఒరిగిందేమిటి? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

కొత్తకుర్రాడు ఆకట్టుకున్నాడు

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే .. గోపాల్‌ పాత్రలో ఆకాష్‌ ఫర్వాలేదనిపించాడు. లుక్‌ వైజ్‌గా చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. సహజంగా కనిపించి చివర్లో పిండేశాడు. నటుడిగా ఫస్ట్ మూవీ కావడంతో ఆ లోటు కనిపిస్తుంది. కానీ మున్ముందు మంచి నటుడిగా మెప్పిస్తాడని చెప్పొచ్చు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తాడని చెప్పొచ్చు. సత్య పాత్రలో హీరోయిన్ భావన పల్లెటూరి అమ్మాయిగా చక్కగా ఒదిగిపోయింది. గొడవపడే సన్నివేశాలు , కొన్ని ఎమోషనల్ సీన్స్ లో పాత్రకు న్యాయం చేసింది.గోపాల్‌ స్నేహితుడిగా శివ పాత్ర మహదేవ్‌ మెప్పించాడు. చివరికి కన్నీళ్లు పెట్టించాడు. ఆయన మరదలిగా గంగ పాత్రలో మధు లత అలరించింది. అందంగానూ ఉంది. సర్పంచ్‌ పాత్రలో తనికెళ్ల భరణి న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి .

టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే ..

ఈ మధ్య వస్తోన్న సినిమాల్లో కథాకథనాలు ఎలా ఉన్నా సరే .. సాంకేతికంగా మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. కథాకథనాలు బట్టి యాంబియన్స్ క్రియేట్ చేయడంలోను , కెమెరా పనితనలోనూ తమ స్టామినా చూపిస్తున్నారు న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్.
శ్యాండిలా పిసపాటి పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మరియు ఆర్ట్ వరకు సినిమా కాన్సెప్ట్ ను ఎలివేట్ చేసే స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగా ఉంది. ఇక శేఖర్ దర్శకత్వ మరియు రచనా ప్రతిభ గురించి మాట్లాడుకోవాలంటే.. పాయింట్ గా అనుకున్నప్పుడు ఇది హిలేరియస్ గా వర్కవుటయ్యే కథ. కానీ.. కథనం & సన్నివేశాల రూపకల్పనలో ఇంకాస్త హోమ్ వర్క్ చేస్తే బాగుండేది. ఎయిడ్స్ వ్యాధి గురించి, దాని నివారణ గురించి వివరించే విధానం ఇంకాస్త బోల్డ్ గా ఉండొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది కలగకూడదు అని దర్శకుడు వేసుకున్న ఈ బోర్డర్ కూడా మైనస్ గా మారింది.మూలకథ విషయంలో మాత్రం దర్శకనిర్మాతల గట్స్ ను , ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.హీరోగా ఆకాష్ గోపరాజుకి మంచి భవిష్యత్ ఉంది. మొదటి సినిమాతో మెప్పించాడనే చెప్పాలి.

ALSO READ :Ram Charan: డంకీ డైరెక్టర్ తో రామ్ చరణ్?

యథార్థ సంఘటన ఆధారంగా

1996లో కొల్లాపూర్‌లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించారు దర్శకుడు గంగనమోని శేఖర్‌. అప్పట్లో ఎయిడ్స్ ప్రభావం చాలా ఉంది. విదేశాలకు వెళ్లినవాళ్లు, ఇతర సీటీలకు బతుకు దెరువు కోసం వెళ్లిన వాళ్లు ఇలా తెలియక, ఎయిడ్స్ పై అవగాహన లేక ఎయిడ్స్ బారిన పడ్డారు. చాలా మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఎయిడ్స్ దేశాన్ని వణికించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో జరిగిన సంఘటనలను `సర్కారు నౌకరి` చిత్రంలో ఆవిష్కరించాడు దర్శకుడు. పెద్ద రోగం కారణంగా ఫ్యామిలీలు ఎలా చెల్లాచెదారుగా మారిపోయాయి. అలాంటి వారిని ఊరు నుంచి వెలేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనలను ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. ఫన్నీగా చెబుతూ, ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాడు. గుండెల్ని బరువెక్కించాడు.

ఇలాంటి చిత్రాలు చేయడం కత్తిమీద సాము

ఇలాంటి సందేశాత్మక చిత్రాలను సందేశంతో తెరకెక్కిస్తే ఆర్ట్ ఫిల్మ్ అవుతుంది. కమర్షియల్‌ అంశాలు జోడితే చెప్పాలనుకున్న విషయం పక్కదాని పడుతుంది. దాన్ని చాలా బ్యాలెన్స్ గా, అంతే సహజంగా తెరకెక్కించడం కత్తిమీద సాములాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు తప్పవు. ఆ విషయంలో దర్శకుడు చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. కొంత తడబాటుకి గురయ్యాడని చెప్పొచ్చు. అయితే సందేశాన్ని ఫన్నీగా చెప్పడంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. అనుకున్న స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. అయితే వాస్తవ సంఘటనలను మాత్రం వెండితెరపై ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయ్యాడు.
ఓవరాల్ గా చెప్పేదేమిటంటే .ఈ మధ్య వస్తోన్న చిత్రాలన్నీ 80, 90 బ్యాక్ డ్రాప్ చిత్రాలే కావడం మనం చూసాం. . సర్కారు నౌకరి 90కి తీసుకెళ్లే చిత్రం. అప్పటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.

ALSO READ:Guntur Kaaram : గుంటూరు కారం వివాదాల ఘాటు.. మరి.. బాక్స్ ఆఫీస్ లో తన ఘాటు చూపిస్తుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు