AP: వామ్మో.. డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు.. పట్టపగలే దర్జాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కిలాడి లేడీలు దర్జాగా చీరలు దోచుకుపోయారు. వేర్వేరు ప్రాంతాలలో వరుసగా రెండు షాపులలో లక్షల విలువచేసే పట్టు చీరలు దోచేశారు. చీర ఒపెన్ చేసి కెమెరాలకు అడ్డుగా పెట్టి వాటి కింద ఉన్న చీరలను దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. By Jyoshna Sappogula 06 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Uppada: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలే దర్జాగా.. బట్టల షాపులకు వచ్చి.. డజన్ల కొద్ది ఖరీదైన పట్టు చీరలు చోరి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చీరలంటే ఆషామాషీ చీరలు కాదు.. ఉప్పాడ జాందాని పట్టుచీరలు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉప్పాడ జాందాని చీరలు తెలియని మగవాళ్ళు ఉంటారెమోగాని..వాటిని తెలియని, ఇష్టపడని మహిళలు మాత్రం ఉండరు. ఉప్పాడ అంటే తూఫాన్ సమయంలో కనిపించే సముద్రతీరం ఉన్న గ్రామమే కాదు.. హస్త కళా నైపుణ్యం కలిగి చరిత్ర కలిగిన చేనేత వస్త్రాల నిలయం. అటువంటి ఉప్పాడ జాంధాని చీరల కోసం ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారు. సినీ తారలు కూడా వివాహం, పండుగల సందర్భంగా ఉప్పాడ వచ్చి జాంధాని పట్టు చీరలు కొనగోలు చేస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో ఉప్పాడ కొత్తపల్లిలో జాందాని చీరల షాపులు అడుగడుగునా దర్శనమిస్తాయి. ప్రతిరోజు మహిళలతో రద్దీగా ఉంటాయి ఈ బట్టల షాప్ లు. Also Read: వీడిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడంతో.. ఇదే అదునుగా చేసుకుని.. దూర ప్రాంతాల నుంచి చీరలు కొనే వారిలా బిల్డప్ ఇచ్చి దర్జాగా వచ్చి చీరల దోచుకుపోతున్నారు గుర్తు తెలియని మహిళ ముఠా. పిఠాపురం నియోజవర్గంలో వేర్వేరు ప్రాంతాలలో వరుసగా రెండు షాపులలో లక్షల విలువచేసే పట్టు చీరలు దోచేశారు. ఉప్పాడ వాగతిప్ప వద్ద సత్య హ్యాండ్లూమ్స్ లో కొంతమంది మాయ లేడీలు చీరలు కొనుగోలు చేసేందుకు వచ్చి ఖరీదైన చీరలు చూపించమని కొనకుండా వెళ్ళిపోయారు. దుకాణంలో ఉన్న కొన్ని చీరలు కనిపించకపోవడంతో సిసి ఫుటేజ్ చెక్ చేశాడు యజమాని శిరం వీర వెంకట సత్యనారాయణ. దొంగిలించిన చీరలను సిసి ఫుటేజ్ లో చూసి యజమాని అవక్కయ్యడు. లక్షలు విలువ చేసే చీరలు దొంగలించడంతో షాపు యజమాని గగ్గోలు పెడుతున్నాడు. ఇదే తరహాలో రెండు రోజులు ముందు గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామంలో చీరలు దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. రెండు షాపులలో.. చీరల దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. మొదట ఇద్దరు రావడం .. తర్వాత మరో ముగ్గురు మహిళలు వచ్చి.. ఒక చీర ఒపెన్ చేసి కెమెరాలకు అడ్డుగా పెట్టి.. వాటి కింద ఉన్న చీరలను దోచేస్తున్నట్లు కెమెరాలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాళ్లు కట్టుకున్న చీర లోదుస్తులలో ప్రత్యేకమైన చిక్కాలు ఏర్పాటు చేసుకుని అందులో దొంగిలించిన ఖరీదైన పట్టు చీరలు దోచేస్తున్నారు కిలాడి మహిళలు. చీరల దొంగలించిన మాయ లేడీలను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత చీరల వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. #kakinada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి