గోవాలో ఘనంగా జరగనున్న సంతోషం అవార్డ్స్ ఈవెంట్ తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సంతోషం అవార్డ్స్' వేడుక ఈసారి మరింత ఘనంగా జరుగనుంది. ప్రముఖ పాత్రికేయుడు సురేష్ కొండేటి అందిస్తున్న 22వ 'సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్'ఈవెంట్ డిసెంబర్ 2న గోవాలో కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. By srinivas 08 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Santosham Awards: తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సంతోషం అవార్డ్స్' వేడుక ఈసారి మరింత ఘనంగా జరుగనుంది. ప్రముఖ పాత్రికేయుడు సురేష్ కొండేటి అందిస్తున్న 22వ 'సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్' (South Indian Film Awards) ఈవెంట్ డిసెంబర్ 2న గోవాలో (Goa) కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు సురేష్ తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా మీడియాతో మాట్లాడిన సురేష్ కొండేటి (Suresh Kondeti).. డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 'మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు. అలాగే హీరోలు, అభిమానులకు ధన్యవాదాలు. సంతోషం అవార్డ్స్ మాత్రమే కాకుండా గతేడాది మొట్టమొదటిసారిగా సంతోషం ఓటీటీ అవార్డ్స్ (Santosham OTT Awards) కూడా ప్రారంభించాం. ఇప్పుడు రెండోసారి ఈనెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్ అందిస్తాం. ఈ సంతోషం సంస్థ నుంచి 25 సంవత్సరాలు పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నాను. దీనితో 22 ఏళ్లు పూర్తి కానుంది' అని తెలిపారు. 2️⃣4️⃣Days To Go For the Biggest #SantoshamSouthIndianFilmAwards2023 ⏳🔥 @TanikellaBharni 📍: Dr.ShyamaPrasadMukherjee Indoor Stadium Goa@santoshamsuresh pic.twitter.com/GFEUs8zk8g — Suresh Kondeti (@santoshamsuresh) November 8, 2023 అలాగే సంతోషం మ్యాగజైన్ మొదలు పెట్టినప్పుడు తాను చాలా చిన్నవాడినని గుర్తు చేశారు. అప్పుడు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రతారలు ఇచ్చిన ప్రోత్సాహంతో అవార్డ్స్ మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇక గోవా గవర్నమెంట్ నుంచి కూడా సహకారం అందిందని తెలిపారు. అయితే మొదట ఈ ఈవెంట్ ను నవంబర్ 18న అనుకునప్పటికీ గోవాలో టోర్నమెంట్ ఉండటం డిసెంబర్ 2న నిర్వహించుకోమని అక్కడి ప్రభుత్వం లెటర్ పంపించారని, ఇందుకుగాను గోవా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. Also Read :KGF లేకపోతే యశ్ ఎవరు?..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.! ఈ క్రమంలోనే తనకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన వారితోపాటు మీడియా మిత్రులు, హీరోల అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక గతేడాదిలాగే ఈసారి కూడా సంతోషం ఓటీటీ అవార్డ్స్ అందిస్తామన్నారు. అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇంకో మూడు సంవత్సరాలు అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తే తన కల నెరవేరుతుందన్నారు. #suresh-kondeti #22-santhosham-awards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి