Sania: పురుష అహంకారులంతా ఆత్మపరిశీలన చేసుకోండి.. సానియా సంచలన వ్యాఖ్యలు!

అర్బన్ కంపెనీ ‘చోటీ సోచ్’ పేరుతో విడుదలచేసిన ప్రకటనపై సానియా మీర్జా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు సాధించిన విజయంపై సమాజంలో ఇంకా చిన్నచూపు తగ్గలేన్నారు. పురుష అహంకారులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

New Update
Sania: పురుష అహంకారులంతా ఆత్మపరిశీలన చేసుకోండి.. సానియా సంచలన వ్యాఖ్యలు!

Sania Mirza on Urban Company Ad: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్త్రీ, పురుషుల మధ్య కొనసాగుతున్న వ్యత్యాసంపై సంచలన కామెంట్స్ చేశారు. సమాజంలో ఇప్పటికీ లింగ వివక్షను చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఈ మేరకు ఇటీవల ఓ మహిళ కారు కొనే ప్రకటనను ఉద్దేశిస్తూ.. సమాజంలో మహిళలు సాధించే విజయాలను ఎలా చిన్న చూపు చూస్తున్నారనే అంశంపై ఆమె సుధీర్ఘంగా చర్చించారు.

మొదటి భారత మహిళను నేనే..
ఈ మేరకు ఇటీవల సానియా (Sania Mirza) నటించిన యాడ్ ను ప్రస్తావిస్తూ.. తన ఎక్స్ ఖాతా వేదికగా సదరు ప్రకటనపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న పలు చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్ (WTA Title) గెలిచిన మొదటి భారత మహిళను నేనే. డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ 1 ప్లేయర్‌గా నిలవడం గొప్ప విషయమే కదా. నేను 6 గ్రాండ్‌ స్లామ్‌లు (Six Grand Slams) గెలిచినా అది ప్రజలకు సంతృప్తినివ్వలేదు. కానీ నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ తెలిపింది.

శ్రమకు బదులుగా అసమానతలు..
అలాగే ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించి ఎందుకు చర్చిస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రకటన చూసిన తర్వాత నా మనసులో చాలా భావాలు మెదిలాయి. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడడం కష్టమని తెలుసు. కానీ ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ అది ఎప్పటికీ జరుగుతుందో తెలియట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ది కూడా చదవండి : AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చదువుతో సంబంధం లేకుండా పదోన్నతులు!

అసలేం జరిగిందంటే..
ఇటీవల అర్బన్ కంపెనీ (Urban Company) ‘చోటీ సోచ్- సంకుచిత ఆలోచనలు’ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుందని, దాన్ని ఇతరులు కూడా గౌరవించాలనే స్పూర్తిదాయక సందేశంతో ఆ ప్రకటనలో చూపించారు. ఆ ప్రకటనలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ ఓ మహిళ కారు కొనగా.. అది చూసిన ఇరుగుపొరుగువారు ఆమె వృత్తిని చులకన చేస్తారు. దాన్ని ఆమె తమ్ముడు అవమానంగా భావిస్తాడు. దీంతో సదరు మహిళ తన సోదరుడితో ప్రతి ఒక్కరు తాను కొన్న కారునే చూస్తున్నారని, కానీ దాను వెనుక ఉన్న తన కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని చెబుతోంది. మహిళ విజయం సాధించిన ప్రతిసారీ ఈ సమాజం కించపర్చాలనే చూస్తోందని, అలాంటి వారి మాటలను పట్టించుకుని మన జీవితాన్ని వదులుకోవాలా? కష్టపడి ముందుకు సాగాలా? అనేది మన నిర్ణయమే అని చెబుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు