Narayanapet District: ఉదయ సముద్రంలో ఇసుక లారీలు సీజ్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న రెండు టిప్పర్‌లను పట్టుకున్నారు. By Karthik 01 Sep 2023 in మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న రెండు టిప్పర్‌లను పట్టుకున్నారు. లారీలను మక్తల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వాటిని మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు టిప్పర్ డైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు రాజకీయ నాయకుల అండతో ఇసుకను తరలిస్తున్నట్లు రుద్ర సముద్రం గ్రామస్తులు తెలిపారు. రాత్రి సమయంలో టిప్పర్ల శబ్దానికి తమకు నిద్ర పట్టడం లేదని గ్రామస్తులు వెల్లడించారు. లోడ్‌లతో వెళ్తున్న వాహనాల వల్ల తమ గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్లపై తాము ఉదయం పొలాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురికావాల్సి వస్తోందన్నారు. ఎక్కడ గుంటలు ఉన్నాయే తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలింపుపై స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ అక్రమ రవాణా ఎక్కువైందన్నారు. స్థానిక పోలీసులకు ఇసుక మాఫియా గ్యాంగ్ ఇస్తున్న ముడుపులు అందడంతో వారు లారీలను ఆపడంలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులను ప్రశ్నిస్తే అక్రమ రవాణా వెనుక రాజకీయ పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారన్నారు. కాగా బీజేపీ నాయకులు తమ ప్రచార వాహనాలను అడ్డంపెట్టి ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. #siege #sand #narayanapet-district #udaya-samudram #illegal #transportation #lorries మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి