Devil Heroine: పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ ముద్దుగుమ్మ..?

ప్రస్తుతం అటు తెలుగులోనూ, తమిళం, మలయాళంలో బిజీగా ఉన్న హీరోయిన సంయుక్త మీనన్‌ గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. త్వరలో ఆమె తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

New Update
Devil Heroine: పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ ముద్దుగుమ్మ..?

భీమ్లా నాయక్‌ (Bheemla nayak) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)  వచ్చినప్పటి నుంచి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. బింబిసార, సార్‌ (Sir), విరూపక్ష, డెవిల్‌ చిత్రాలతో మరిన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు కంటే ముందుగానే మలయాళంలో నటించడంతో అక్కడ మరిన్ని హిట్లు ఖాతాలో వేసుకుని ముందుకు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

దీంతో నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఇటు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సంయుక్త మీద రూమర్లు కూడా షికారు చేస్తున్నాయి. రీసెంట్ గా ఓ రూమర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నిజానికి తెలుగు సహా తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేసుకోస్తోంది సంయుక్త.

ప్రస్తుతం సంయుక్త సినిమాలు తగ్గించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొత్త ప్రాజెక్టలను ఒప్పుకోలేదు. దీంతో ఆమె తన స్నేహితుడితో రిలేషన్‌ షిప్‌ (Relationship)లో ఉందని కొన్ని రుమార్స్‌ షికార్‌ చేస్తున్నాయి. ఈ ఏడాదినే ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టిందని తెలుస్తోంది.

సంయుక్త సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు చిత్రం గుంటూరు కారంలో చిత్రంలో కూడా నటించనున్నట్లు...వార్తలు వినిపించాయి. అయితే ఆమె డెవిల్‌ చిత్రంలో తప్ప ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అందుకు కారణం కూడా ఆమె పెళ్లినే అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా కొంత కాలం క్రితం విడాకులు తీసుకున్న ఓ తమిళ నటుడితో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి.

కానీ అవన్నీ కూడా వదంతులు అంటూ కొట్టి పారేసింది. తన స్నేహితుడితో డేటింగ్ లో ఉన్న సంయుక్త అతనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై నిజమెంతో.. ఆ పెళ్లికొడుకు ఎవరో సంయుక్త వెల్లడించాల్సి ఉంది.

Also read: రెడ్‌మి నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్.. అమెజాన్లో కేవలం రూ.11 వేలకే!

Advertisment
Advertisment
తాజా కథనాలు