Sam Pitroda: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా.. తూర్పున చైనీస్ లా.. శామ్ పిట్రోడా కొత్త వివాదం!

భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు, తూర్పున  ఉన్నవారు చైనీస్‌లా ఉంటారంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

New Update
Sam Pitroda: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా.. తూర్పున చైనీస్ లా.. శామ్ పిట్రోడా కొత్త వివాదం!

South Indians look like Africans - Sam Pitroda: భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా కొత్త వివాదానికి తెరలేపారు. అమెరికాలో తాను రేకెత్తించిన వారసత్వ పన్ను వ్యాఖ్యల మంటలను ఆర్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు "దక్షిణాదిలో ఆఫ్రికన్‌ల వలె కనిపిస్తారు - పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు -ఉత్తరాన ఉన్నవారు తెల్లవారిలా- తూర్పున  ఉన్నవారు చైనీస్‌లా కనిపిస్తారు." అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారతదేశం ఉజ్వలమైన ఉదాహరణ అని చెబుతూ పిట్రోడా (Sam Pitroda) “దేశంలోని ప్రజలు అక్కడక్కడా జరిగే తగాదాలను విడిచిపెట్టి కలిసి జీవించగలిగే చాలా సంతోషకరమైన వాతావరణంలో 75 సంవత్సరాలు జీవించారు" అని అన్నారు.

పిట్రోడా, ‘ది స్టేట్స్‌మన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని వివరిస్తూ.. “అక్కడక్కడ కొన్ని తగాదాలను పక్కనపెట్టి, ప్రజలు కలిసి జీవించగలిగే చాలా సంతోషకరమైన వాతావరణంలో మేము 75 సంవత్సరాలు జీవించాము. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా, పశ్చిమాన ప్రజలు అరబ్‌లా, ఉత్తరాన ఉన్నవారు తెల్లవారిలా - దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లలా కనిపించే భారతదేశం వలె విభిన్నమైన దేశాన్ని మనం కలిపి ఉంచగలం.’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

భారతదేశ ప్రజలు వివిధ భాషలు, మతం, ఆహారం - ఆచారాలను గౌరవిస్తారని, ఇది ప్రాంతాలను బట్టి మారుతుందని ఆయన అన్నారు. "ఇది నేను విశ్వసించే భారతదేశం, ఇక్కడ ప్రతి ఒక్కరికీ స్థానం ఉంటుంది.  ప్రతి ఒక్కరూ కొంచెం రాజీపడతారు," అని ప్రిటోడా(Sam Pitroda) చెప్పారు. 

Also Read: రాజకీయ వారసుడి పై మాయావతి వేటు..కేవలం 5 నెలల్లోనే!

వివాదం ఇదీ..
అంతకుముందు, పిట్రోడా (Sam Pitroda) అమెరికాలో వారసత్వ పన్నుల భావన గురించి మాట్లాడుతూ.. వివాదాన్ని ప్రారంభించారు. అవి చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.

“అమెరికాలో, వారసత్వపు పన్ను ఉంది. ఒక వ్యక్తి 100 మిలియన్ USD విలువైన సంపదను కలిగి ఉంటే, అతను మరణించినప్పుడు అతను తన పిల్లలకు 45 శాతం మాత్రమే ట్రాన్స్ ఫర్  చేయగలడు, 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు సంపదను సంపాదించారు. మీరు ఇప్పుడు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజల కోసం వదిలివేయాలి.  మొత్తం కాదు, అందులో సగం, ఇది నాకు న్యాయంగా అనిపిస్తుంది, ”అని పిట్రోడా అన్నారు.

ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన తరువాత పిట్రోడా USలో వారసత్వపు పన్నును మాత్రమే ఉదాహరణగా చెబుతున్నానని చెబుతూ సమస్యను తగ్గించాలని ప్రయత్నించారు.  

“మేము 55 శాతం తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? బీజేపీ, మీడియా ఎందుకు భయపడుతున్నాయి? నేను TVలో నా సాధారణ సంభాషణలో USలో US వారసత్వ పన్నును ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించాను. నేను వాస్తవాలను ప్రస్తావించలేదా? ప్రజలు చర్చించుకోవాల్సిన- చర్చించాల్సిన సమస్యలపై నేను చెప్పాను. దీనికి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానానికి ఎలాంటి సంబంధం లేదు' అని పిట్రోడా ఎక్స్‌లో తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు