Vastu Tips : ఆఫీస్ టేబుల్ ఇలా ఉంటే మీ జీతం రెట్టింపు అవ్వడం ఖాయం..అదృష్టం బంకలా పట్టుకుంటుంది..!!

మనం డబ్బు సంపాదించేందుకు ఎంతో కష్టపడుతుంటాం. అయితే ఒక్కోసారి మనం అనుకున్నంత జీతం అందక ఇబ్బంది పడుతుంటాం. అయితే వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే జీతం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలని ఉందా? ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Vastu Tips : ఆఫీస్ టేబుల్ ఇలా  ఉంటే మీ జీతం రెట్టింపు అవ్వడం ఖాయం..అదృష్టం బంకలా పట్టుకుంటుంది..!!

Vastu Tips : కొంతమంది పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తుంటారు. ఆఫీసుకు త్వరగా వెళ్తుంటారు. ఆలస్యంగా వస్తుంటారు. కానీ జీతం మాత్రం పెరగదు. అయితే మన ఆఫీసు టేబుల్ లో కొన్ని మార్పులు చేస్తే ఆర్థికంగా మేలు జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ మార్పులు ఏమిటో తెలుసుకుందామా?

- వాస్తుశాస్త్రం ప్రకారం..వెదురు మొక్కను టేబుల్ పై ఉంచండి. ఇలా ఉంచితే మీకు ప్రమోషన్ త్వరగా లభిస్తుంది. అలాగే ఇది మీ అదృష్టాన్ని కూడా మారుస్తుందన్న నమ్మకం ఉంచితే చాలు.

- వాస్తు ప్రకారం ఇంట్లో, ఆఫీసులో లైటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మీ టేబుల్ దగ్గర లైట్ సరిగ్గా లేనట్లయితే..చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి లైటింగ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.

-ప్రమోషన్ కావాలన్నా, జీతం పెరగాలన్నా టేబుల్ మీద బంగారు నాణెంను ఉంచాలట. నిజమైన బంగారు కాయిన్స్ ఉండటం మంచిది కాదు..కాబట్టి మార్కెట్లో దొరికే ఈ నాణేలతో ఉన్న బోట్ మోడల్ ను కొని వాటిని టేబుల్ పై ఉంచండి.

-వాడిపోయిన పువ్వు లేదా మొక్కను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆఫీసు లేదా ఇంటి టేబుల్ పై ఉంచకూడదు. ఇలా పెడితే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మీరు చేసే పనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

-వాస్తు ప్రకారం వెదురు మొక్క..ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, అద్రుష్టాన్ని తెస్తుందట. వెదురు మొక్కను కచ్చితంగా నాటలట. ఇలా ఒక మొక్కను ఇంట్లో..ఇంకో మొక్కను ఆఫీసులో నాటినట్లయితే...లక్ష్మీదేవి తలుపులు తెరుచుకుని వస్తుందట. అదృష్టం బంకలా పట్టుకోవడమే కాదు...కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందట. దాన్ని చూసినప్పుడుల్లా మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

నోట్: ఈ స్టోరీలో అందించిన సమాచారం కేవలం ఇంటర్నెట్ నుంచి మాత్రమే సేకరించింది. దీనిని RTV ధృవీకరించడం లేదని గమనించండి.

ఇది కూడా చదవండి: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..వందశాతం మరణాల రేటు…మనుషులకు వ్యాపిస్తుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు