Salaar: సలార్.. యూఎస్ఏలో సినిమా ప్రీ-రిలీజ్ సేల్స్‌ అదుర్స్

ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి-1, బాహుబలి 2 సినిమాలతో ఈ నటుడి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడీ హీరో నుంచి సలార్ వస్తోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆల్రెడీ అమెరికాలో ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. సంచలనాలు నమోదవుతున్నాయి అక్కడ.

New Update
Salaar: సలార్.. యూఎస్ఏలో సినిమా ప్రీ-రిలీజ్ సేల్స్‌ అదుర్స్

Salaar pre-release sales in USA: సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా ఒక నెల సమయం ఉండగానే, యుఎస్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ సేల్స్‌ చుక్కల్ని తాకాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా ఆల్రెడీ లక్ష డాలర్లు (83.07 లక్షల రూపాయలు) మార్కును అందుకుంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో ఇది విడుదలకు ముందే 2 లక్షల డాలర్లు ఆర్జించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రెండు భాగాలుగా చిత్రం 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోంది సలార్. రెండు భాగాలుగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో, మొదటి భాగానికి సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ అనే పేరు పెట్టారు. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాలో.. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరులో విడుదల

సెప్టెంబర్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది సలార్ మూవీ. ట్రేడ్ సర్కిల్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా పలు ప్రాంతాల్లో సలార్ సినిమా.. ఆర్‌ఆర్‌ఆర్‌ని మించిపోతుందని తెలుస్తోంది. ప్రాథమిక అంచనాలు నిజమైతే, సలార్ తొలిరోజు 200 కోట్ల రూపాయల మార్క్ ను తాకుతుంది.

ప్రస్తుతం సాలార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ (టీజర్) రిలీజైంది. దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రయిలర్ రాబోతోంది. ఆగస్ట్ 15 కానుకగా సలార్ ట్రయిలర్ ను రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగినప్పటికీ, అది నిజం కాలేదు. త్వరలోనే ఈ సినిమా ట్రయిలర్ మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత ఈ సినిమాకు మరింత జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు