Sajjala comments : నువ్వేమన్న స్వతంత్య్ర సమరయోధుడివా..ఆసుపత్రికి వెళ్లమని పంపిస్తే..ఈ హడావుడి ఏంటి..!! చంద్రబాబు ఈ జన్మలో మారారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. బరితెగింపుతో మేమింతే అనేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆసుపత్రికి వెళ్లమని పంపిస్తే ఈ హడావుడి ఏంటని ప్రశ్నించారు. By Bhoomi 01 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి చంద్రబాబు విడుదలపై ప్రభుత్వ సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు అనారోగ్య రీత్యా నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చారని...ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుని రమ్మని చెబితే..మంగళవారం మధ్యాహ్నం రూట్ మ్యాప్ సెట్ చేసుకుని మరీ ఒక యాత్రలా వెళ్లారంటూ విమర్శించారు. రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లేందుకు 2.30గంటల సమయం పడుతుంది. కానీ చంద్రబాబుకు 14గంటల సమయం ఎలా పట్టిందని ప్రశ్నించారు. రోగి అని చెప్పిన వ్యక్తి యోగిలా.. స్వతంత్య్ర సమరయోధుడిలా హడావుడి ఎందుకు అంటూ నిలదీశారు. చంద్రబాబు కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు చెప్పినా కూడా వినకుండా బరి తెగింపు రాజకీయం చేస్తూ మేమేం ఇంతే ఇలానే ప్రవర్తిస్తాం అనేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇక ఈ జన్మలో మారారు. రోగం ఉందని బయటకు వచ్చిన బాబు ప్రజలను మళ్లించే ప్రయత్నాలు చేశారన్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కోర్టుకు సిఐడి ఫిర్యాదు..!! కాగా నిన్న జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు సాయంత్రం 4.15 గంటలకు రాజమండ్రి నుంచి బయలు దేరారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలో తన నివాసానికి వచ్చారు. రాజమండ్రికి చేరుకున్న భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి రోడ్డు మార్గంలో 14 గంటలు ప్రయాణం చేసి ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నివాసానికి చేరుకున్నారు బాబు. దారి పొడవునా చంద్రబాబు నాయుడును చూడ్డానికి ప్రజలు వస్తూనే ఉన్నారు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం పెద్ద సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం..రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు.! ఇంటికి వచ్చిన వెంటనే చంద్రబాబు మొట్టమొదటగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఆ తర్వాత పూజారులు, పండితులు బాబు దంపతులను ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాకకు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు.రెండు నెలలు జైల్లో గడిపి వచ్చిన బాబును చూసి బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది కన్నీరు పెట్టుకుని మరీ తమ అభిమాన్నాన్ని, ప్రేమను చూపించారు.చంద్రబాబు ప్రతీ ఒక్కరినీ దగ్గర తీసుకుని మరీ పలకరించారు. అయితే సుదీర్ఘ ప్రయాణం వలన బాబు బాగా అలిసి పోయారని చెబుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈరోజు కొంతసేపు కుటుంబసభ్యులు, బంధువులతో గడిపిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళనున్నారు. అక్కడ ఆయన ఎప్పుడూ వెళ్ళే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. #sajjala-comments #sajjala-comments-on-chandrababu-bail మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి