/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-13.jpg)
Devara Movie : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈయనతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈనేపథ్యంలో ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేసిన మూవీ టీమ్ నేడు (ఆగస్టు 16) సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన గ్లింప్స్ వీడియోను వదిలారు. ఈ వీడియోలో 'భైర' పాత్రలో సైఫ్ రూపు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు చూడని లుక్‌లో సైఫ్ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'దేవర' లో విలన్ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అనేది ఈ గ్లింప్స్‌తో స్పష్టమవుతోంది.
His hunt will be legendary 🔥
Presenting #SaifAliKhan as #Bhaira from the world of #Devara ❤️🔥
- https://t.co/gDOgTGxqTO#DevaraOnSep27th
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial@NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril… pic.twitter.com/qnzDzRXDu5— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2024
ఇక వీడియోలో సైఫ్ అలీఖాన్ లుక్, అనిరుద్ బీజీయం, ఫైట్ సీక్వెన్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసాయి. అంతేకాదు సైఫ్ రోల్ సినిమాలో చాలా క్రూరంగా ఉండబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక గ్లింప్స్ ను చూసిన ఫ్యాన్స్ తారక్ కు ధీటైన విలన్ గా సైఫ్ ఫిజిక్, లుక్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.