మరుభూమిని తలపిస్తోన్న మోరంచపల్లి.. వరద బాధితుల కన్నీటిగాథ!

అందమైన పల్లెటూరు అందవిహీనంగా మారిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో ఎటు చూసినా కన్నీటిగాథలే వినిపిస్తున్నాయి. గట్టు తెంచుకుని జంపన్నవాగు ఊళ్ల మీద పడడంతో ఏడుగురు గల్లంతయ్యారు. వందలాది మూగజీవాలు కట్టేసిన చోటే ప్రాణాలు వదిలాయి.

New Update
మరుభూమిని తలపిస్తోన్న మోరంచపల్లి.. వరద బాధితుల కన్నీటిగాథ!

మోరంచపల్లి.. 300 ఇళ్లు..700 మంది జనాభా ఉన్న అందమైన పల్లెటూరు. కానీ మోరంచ వాగు సృష్టించిన బీభత్సానికి మోరంచపల్లి ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఊరుకు ఊరు నీట మునిగి..ఇప్పుడే తేరుకుంది. ప్రతి ఇల్లు నీట మునిగింది. సర్వం కోల్పోయిన గ్రామస్తులు కట్టుబట్టలతో రోడ్డుపై ఉన్నారు. ఇప్పుడు నీళ్లు వెళ్లిపోవడంతో మోరంచ వాగు సృష్టించిన భయానక పరిస్థితులు అందరి గుండెలను మెలిపెట్టేస్తున్నాయి. రోడ్డేదో, ఇళ్లేదో తెలియని పరిస్థితి. మొత్తం బురద. ఇంట్లోని వస్తువులన్ని వరదలో కొట్టుకుపోయాయి. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన పంటపొలాల్లో ఇసుక మేటలు వేసి ఎడారిని తలపిస్తోంది. ఇళ్లల్లోని ఫ్యాన్లకు సైతం చెత్తె చెదారం పట్టుకుందంటే..వరద ప్రవాహం ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు పాడి పశువులు, పంట పొలాలతో ఎంతో అందంగా కనిపించిన మోరంచపల్లి... ఇవాళ పశువుల కబేళాలతో హృదయ విదారకరంగా మారింది. ఇళ్ల ముందు కట్టేసిన పశువులు కట్టుమీదనే చనిపోయి ఉండడం అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టిస్తోంది. వరద సమయంలో కట్టు తెంచుకుని పోలేక..నీళ్ల నుంచి తప్పించుకోలేక పశువులు నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయాయి.

ఒక్కొక్కరిది ఒక్కొ కన్నీటి గాథ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jaya shankar bhupalapalli) మోరంచపల్లి(Moranchapalli) వాసుల కన్నీటిగాథ అంతాఇంతా కాదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన వాగులు, వంకలు...పలు తెలంగాణ జిల్లాల్లో నింపిన విషాదానికి గుర్తులుగా మిగిలిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదలు..ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పదుల సంఖ్యలో జనం వరదలో గల్లంతయినట్లు తెలుస్తోంది. ఇటు అయిన వాళ్లను, అటు సర్వం కోల్పోయిన బాధితుల ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

పశువుల కబేళాలతో హృదయ విదారకరం పరిస్థితిలు

ఇక సమ్మక్క, సారలమ్మల భక్తులు అత్యంత పవిత్రంగా భావించే జంపన్న వాగు గట్లు తెంచుకుని పరుగులు తీసింది. గురువారం ఉదయం కొండాయి, మల్యాల గ్రామాలపై విరుచుకుపడింది. వరద ఉద్ధృతిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన మజీద్‌,షరీఫ్,అజ్జు ఉన్నారు. ఉదయం వీరి మృతదేహాలు వెలికి తీశారు. వందలాది మూగజీవాలు ఏం జరుగుతుందో తెలియని మూగజీవాలు కట్టేసిన చోటే ప్రాణాలు వదిలాయి. ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలోనూ వరదలు విషాదాన్ని నింపాయియ మారేడుగొండ చెరువుకు గండిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో వస్తువులే కాదు ఆధారం అయిన అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. కనీసం తినటానికి నాలుగు గింజలు కూడా లేని పరిస్థితి. ఒకే ఒక్క రాత్రి..ఆ గ్రామస్తులు సర్వం కోల్పోయారు. వరద తగ్గిన తర్వాత ఇళ్లకు వచ్చి చూసుకుంటున్న బాధితుల కన్నీళ్ల భారాన్ని ఏ దేవుడు మోయగలడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు