Train Accident: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ట్రాక్‌పై బండరాయి ఎక్కడంతో 20 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెమ్మదిగా రావడంతో ప్రమాదం తప్పిందన్నారు. పోలీసులు, ఐబీ దర్యాప్తు చేపట్టాయి.

New Update
Train Accident: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్!

Sabarmati Express: దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ట్రాక్‌పై బండరాయి ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారు తెలిపారు. కాసేపట్లో కాన్పూర్‌ స్టేషన్ వస్తుందనగా ప్రమాదం జరిగిందని, అప్పటికే రైలు స్లో కావడంతో పెను ప్రమాదం తప్పినట్లు చెప్పారు. దీంతో 20 బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, ఐబీ దర్యాప్తు చేపట్టాయి.

ఇటీవలి కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం రైలు పట్టాలు తప్పిన ఘటనలు ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఝార్ఖండ్ ​లో హౌరా ఎక్స్ ప్రెస్ 18 బోగీలు పట్టాలు తప్పి ఇద్దరు మరణించగా 5గురు గాయపడ్డారు. జూన్ లో పశ్చిమ బెంగాల్ లో ఓ గూడ్స్​ రైలు- కాంచనగంగా ప్యాసింజర్​ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 11మంది మరణించగా 60మందికి తీవ్ర గాయలయ్యాయి.

జులై 18న ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్‌లో మరో ప్రమాదం జరిగింది. చండీగఢ్-దిబ్రూగడ్ రైలుకు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి పైగా గాయాలయ్యాయి. జులై 19న గుజరాత్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వల్సడ్ నుంచి సూరత్ స్టేషన్ల మధ్య ఆ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 21న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రోహా మీదుగా ఢిల్లీ వైపు ఓ గూడ్స్ రైలు వెళ్తోంది. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా మూడు బోగీలు బోల్తాపడ్డాయి. మరో మూడు బొగీలు పట్టాలు తప్పాయి.

జులై 29న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. దర్బంగ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. ఇంజిన్ నుంచి బోగీలు వీడిపోయాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జులై 30న జార్ఘండ్‌లోని బారాబంబో వద్ద రైలు పట్టాలు తప్పింది. హౌరా - ముంబై మెయిల్‌కు చెందిన రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.

Also Read : రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం: బీఆర్ఎస్ వినూత్న ప్రచారం

Advertisment
Advertisment
తాజా కథనాలు