/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-30T154640.240-jpg.webp)
SHABARIMALA: హరిహరసుతుడు అయ్యప్ప శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం . తండ్రియైన జగత్ప తి ఆజ్ఞ ప్ర కారము పంపాసరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించి భక్తజననీరాజనాలు అందుకుంటున్నాడు. ధర్మశాస్తగా పూజలందుకుంటున్న అయ్య ప్పస్వా మి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యా న్ని కలిగించింది.
సత్ గుణాలను చేకూర్చే తత్వమే ..తత్వమసి
తనను నమ్మిన భక్తులను సన్మార్గంలో నడిపించేందుకు నియమనిష్టలతో కూడిన ధర్మసూత్రాలు భక్తుల జీవితాలలో వెలుగులు నింపుతాయి. అయ్యప్ప మాలదారణలో బాగంగా మండల కాలంలో బ్రహ్మచర్యదీక్ష చేపట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇలా దీక్ష చేపట్టిన భక్తులకు ఆత్మజ్ఞానాన్నికలిగింఛి సకల జీవులలో ఆ హరిహరపుత్రుని దర్శించే తత్వాన్ని రగిలించే మార్గం ఒకటుంది. ఆ సత్ గుణాలను చేకూర్చే తత్వమే ..తత్వమసి. ఈ వాక్యాన్నే శభరిమలలో అయ్యప్ప సన్నిధిలో పదునెట్టాంపడి ఎదురుగా కనిపించే సన్నిధానం పైన రాయడం జరిగింది.
నమస్కారానికి తత్వమసికి ఉన్న అంతర్గతబంధం
హిందు సంప్రదాయంలో మమేకమై ఉన్న నమస్కారానికి ఈ తత్వమసికి ఉన్న అంతర్గత బంధం గురించి మన పురాణాలలో సైతం చెప్పడం జరిగింది. చేతులు జోడించి నమస్కరించడంలో ఉన్న పరమార్ధాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు చేతులతో నమస్కరించడం అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేసి మనమంతా ఒక్కటే అని చెప్పే ఈ నమస్కారం మూలమంత్రమే ఉపనిషత్ సారమైన తత్వమసి అనే మహా వాక్యం. శబరిమల సన్నిధానంలో రాసిన ఈ వాక్యంలో దాగిన అతర్గత పరమార్ధం ఇదే.
తత్వమసి అంటే
నలబై ఒక్క రోజుల కఠోర అయ్యప్ప దీక్షతో శభరిమల చేరుకున్న భక్తులకు పవిత్రపావన పదునెట్టాంపడి ఎక్కగానే ఆ స్వామిని చేరే క్రమంలో ముందుగానే మనకు దర్శన మిస్తుంది తత్వమసి అనే మహా వాక్యం. సంస్కృత పదం అయిన తత్వమసి యొక్క అర్ధం సవివరంగా చెప్పాల్సివస్తే అది నీవై ఉన్నావు అనే అర్ధం గోచరిస్తుంది. నువ్వు ఎ భగవంతుడి ధర్శనార్ధం స్వామీ సన్నిధికి చేరుకున్నవో ఆ భగవంతుడు నీలోనే అంతర్యామియై ఉన్నాడు అని చెప్పే పరమ పవిత్ర నామం తత్వమసి. దీక్ష పూనిన ప్రతీ ఒక్కరు స్వామి సన్నిధి చేరుకోగానే ఈ మహావాక్యం తప్పకుండా చదువుతారు.
ALSO READ :AP Politics: జానీ గూటికి జానీ మాస్టర్