Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్‌ పౌరులు మృతి!

రష్యా మరోసారి ఉక్రెయిన్‌ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్‌ పౌరులు మరణించారు. బఫర్‌జోన్‌ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది.

New Update
Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్‌ పౌరులు మృతి!

Russia - Ukraine War: రష్యా మరోసారి ఉక్రెయిన్‌ పై క్షిపణులతో (Missiles) విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్‌ పౌరులు మరణించారు. బఫర్‌జోన్‌ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో ఉక్రెయిన్‌ పై రష్యా తన విశ్వరూపం చూపిస్తూ విరుచుకుపడింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 16 మందికి తీవ్ర గాయాలైనట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) తీవ్రంగా స్పందించారు. రష్యాది అతి కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని యుద్ధం చేస్తున్నట్లు జెలెన్‌ స్కీ అన్నారు. పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినన్ని రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదన్నారు.

రష్యా (Russia) సరిహద్దు నుంచి ఖర్కీవ్‌ నగరం కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకొని బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేయాలనేది రష్యా లక్ష్యం. ఈ క్రమంలోనే క్షిపణులతో దాడి చేసి అక్కడి ఆస్తులను నాశనం చేస్తుంది. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవడంలో ఉక్రెయిన్‌ (Ukraine) వెనకబడింది. ఇదే అదునుగా భావించిన రష్యా దాడులు చేస్తోంది.

Also Read: దేశంలోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..రెడ్‌ అలర్ట్ జారీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు