Anudeep Movie : అనుదీప్ మూవీలో "సప్త సాగరాలు దాటి" .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా

జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ స్టార్ హీరో రవితేజతో సినిమా చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరలవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

New Update
Anudeep Movie : అనుదీప్ మూవీలో "సప్త సాగరాలు దాటి" .. రుక్మిణి వసంత్  హీరోయిన్ గా

Anudeep Movie : అనుదీప్ కే(Anudeep. K). వి జాతిరత్నాలు(Jathi Rathnalu) సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అనుదీప్.. అదే ఊపులో తమిళ నటుడు కార్తికేయతో తన రెండో సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ కు ఈ సినిమా ఊహిచినంత ఫలితాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు అనుదీప్ తన మూడవ సినిమా మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) తో చేయబోతున్నారు అంటూ కొద్దీ రోజులుగా సోషల్ మీడియా(Social Media) లో ఓ న్యూస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది.

హీరోయిన్ గా రుక్మిణి వసంత్

అనుదీప్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రంలో 'సప్త సాగరాలు దాటి'(Sapta Sagaralu Dhaati) రుక్మిణి వసంత్(Rukmini Vasanth) కథానాయికగా ఎంపికైనట్లు నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఈ బ్యూటీ రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన 'సప్త సాగరాలు దాటి' కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తన సహజ నటనతో తెలుగులో కూడా మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ రవితేజ వంటి స్టార్ హీరోతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబో నిజమైతే రవితేజ అభిమానులకు పండగే.

Also Read: Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో

publive-image

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్స్ కారణంగా వెనక్కి వెళ్లిన ఈగల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈగర్ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఈగల్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో మరో సినిమాను స్టార్ట్ చేశారు.

Also Read: Director Anudeep: వావ్ క్రేజీ కాంబో.. అనుదీప్ నెక్స్ట్ మూవీ హీరో ఎవరో తెలుసా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు