AP Elections 2024 : ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటారా? కూటమి సక్సెస్ అవుతుందా? కాంగ్రెస్ బోణీ కొడుతుందా? అనే చర్చ నేపథ్యంలో RTV నిర్వహించిన స్టడీలో ఏ పార్టీ గెలవబోతుందో తేలింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Elections 2024 : ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

AP Game Changer RTV : ఏపీ(AP) లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పోలింగ్(Polling) కు మరో తొమ్మిది రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా పవర్ లోకి రావాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి(TDP-Janasena-BJP Alliance) సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో(Elections) ఎలాగైనా సత్తా చాటి అసెంబ్లీలో కాంగ్రెస్ ఖాతా తెరిపించాలన్న పట్టుదలతో షర్మిల కష్టపడుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటారా? కూటమి సక్సెస్ అవుతుందా? విభజిత ఏపీలో ఈ సారైనా కాంగ్రెస్ బోణీ కొడుతుందా? అన్న చర్చ ఏపీతో పాటు తెలంగాణలోనూ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో RTV నిర్వహించిన స్టడీలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రెండు రోజులుగా రాయలసీమ, కోస్తా ఆంధ్రలో ఎవరు పై చేయి సాధించబోతున్నారో చెప్పిన రవి ప్రకాశ్.. ఈ రోజు ఏపీలో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారు. ఆయన చెప్పిన పూర్తి వివరాలు, లెక్కలు ఇలా ఉన్నాయి.

publive-image

Also Read : ఎన్నికల వేళ కీలక పిలుపునిచ్చిన సీఎం జగన్.. ట్వీట్ వైరల్!

రాయలసీమ:
ఈ ప్రాంతంలో మొత్తం 52 స్థానాలుండగా.. ఈ ఎన్నికల్లో వైసీపీ 29, టీడీపీ 22, కాంగ్రెస్ పార్టీ 1 సీటు గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.

దక్షిణ కోస్తా:
ఈ జిల్లాల్లో మొత్తం 55 సీట్లు ఉండగా.. వైసీపీ 15, టీడీపీ 37, జనసేన 2, బీజేపీ 1, కాంగ్రెస్ 0 సీట్లు సాధించే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో వెల్లడైంది.

ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు:
ఈ జిల్లాల్లో మొత్తం 68 సీట్లు ఉండగా.. వైసీపీ 19 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఈ జిల్లాల్లో 36, జనసేన 11, బీజేపీ 2, కాంగ్రెస్ 0 సీట్లకు ఈ ప్రాంతాల్లో పరిమితం అయ్యే అవకాశం ఉంది.

publive-image

టీడీపీ కూటమిదే అధికారం:
ఈ ఎన్నికల్లో 151 సీట్లకుగాను 151 సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ ఈ సారి కేవలం 63 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది. టీడీపీ 95 సీట్లు సాధించి అధికారం దక్కించుకుంటుందని ఆర్టీవీ స్టడీలో వెల్లడైంది. ఇంకా జనసేన సైతం ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతుందని ఆర్టీవీ స్టడీలో స్పష్టమైంది. బీజేపీ కూడా మూడు సీట్లు సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతుందని ఆర్టీవీ స్టడీలో తేలింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టని కాంగ్రెస్ ఈ సారి ఒక సీటు సాధిస్తుందని ఆర్టీవీ స్టడీలో వెల్లడైంది.


ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందన్న వివరాలు ఇవి. ఓటింగ్ లోపు ట్రెండ్‌ కొంచెం అటూ ఇటూ మారే అవకాశం ఉంటుంది. పోలింగ్ తర్వాత స్పష్టమైన ట్రెండ్ వచ్చేస్తుంది. ఆ ట్రెండ్ ఏమిటనేది కూడా ఆర్టీవీ మీకు అందిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు