RTV Big Breaking: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం!

దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకోనుంది. పుష్కర కాలానికి పైగా తెలంగాణ ఉద్యమాన్ని నడపడంతో పాటు.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో..

New Update
RTV Big Breaking: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం!

మోదీ.. నిన్ను దేశం నుంచి తరిమేస్తాం.. మాకు నిధులు ఇచ్చేటోన్నే తెచ్చుకుంటాం.. నీ ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా.. సరిగ్గా 13 నెలల కింద వరంగల్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ పదమూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు తలకిందులయ్యాయి. ప్రత్యర్థి రేవంత్ సీఎం కుర్చీ ఎక్కి పవర్ కమిషన్, కాళేశ్వరం స్కామ్ అంటూ కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. రోజుకో నేత, వారానికో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. మరో వైపు బిడ్డ అరెస్ట్ తో ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం చుట్టుముడుతున్న అనేక సమస్యల నుంచి బయటపడాలంటే ఇదే సరైన మార్గమని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో సాగుతున్నట్లు సమాచారం.

ఢిల్లీ ఎన్నికల తర్వాతనే..?
ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఈ విలీన ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తో తమకు అక్కడ కలిసి వస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఒకవేళ ఈ లోపు బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే.. ఆ పరిణామం తమకు ఇబ్బంది కలిగిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ ఎన్నికలలోపే విలీనం పూర్తయితే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని.. లిక్కర్‌ స్కామ్‌ కక్ష సాధింపేనని ఆప్‌ ఎదురు దాడి చేసే అవకాశం ఉందని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే ఢిల్లీ ఎన్నికల వరకు ఈ విలీన ప్రక్రియ ఆగనుంది.
publive-image

విలీనం జరిగితే బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావు పరిస్థితి ఏంటన్న అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. విలీనంలోపే బీజేపీ ఈ విషయమై బీఆర్ఎస్ కు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించడమే కాకుండా.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నే ముందు పెట్టి బీజేపీ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేసే అవకాశం ఉంది.
publive-image

తెలంగాణ పాలిటిక్స్ లో మార్పులు..
గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సబిత ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి లాంటి నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం చాలా రోజుల నుంచి సాగుతోంది. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే.. వలసలకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరి కంఫర్ట్ గా లేని వారు కూడా తిరిగి వచ్చే బీఆర్ఎస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లాంటి బలమైన నాయకత్వం తమకు ఉందని బీఆర్ఎస్ కేడర్ కు మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది.

తెలంగాణలో ప్రతిపక్షమే లేదని భావిస్తున్న కాంగ్రెస్ కు ఈ పరిణామం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే ప్రతిపక్షం బలం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ విలీనం అయితే తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ రానుంది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత బీజేపీ అధికారం వచ్చే ఛాన్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశం ఉంటుంది. 2028లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించనుంది.
publive-image

విలీనం ఎందుకు?
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా 39 మంది ఎమ్మెల్యేల విజయంతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ.. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ గూటికి చేరిపోయారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని అధికార పార్టీ ధీమాగా చెబుతోంది. ఇది జరిగి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోకముందే పార్టీని బీజేపీలో కలిపేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
publive-image

మరోవైపు.. బిడ్డ కవిత అరెస్ట్ తో మానసికంగా కుంగిపోయిన కేసీఆర్.. ఆమెకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడడంతో ఆందోళనగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదన్న వార్తలు కేసీఆర్ ను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత అప్రూవర్ గా మారాలని బీజేపీ ప్రతిపాదన తేగా.. బీఆర్ఎస్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.
publive-image

వరుస ఓటములు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లకు పడిపోవడం బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేసినట్లు తెలుస్తోంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ పరిస్థితి ఇంకా పడిపోయే అవకాశం ఉంటున్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో రోజురోజుకూ బలపడుతున్న కాంగ్రెస్ ను ఢీకొట్టాలంటే బీజేపీలో విలీనం కావడమే మంచిదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు సమాచారం.
publive-image

బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే మారనున్న లెక్కలు?
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి వచ్చిన సీట్లు కలిపితే మొత్తం సీట్లు 68. అనంతరం జరిగిన 2018 ఎన్నికల్లో ఈ సంఖ్య 89. ఇటీవలి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలకు వచ్చిన సీట్లు మొత్తం 47. సీట్ల సంఖ్యను పక్కన పెడితే.. ఈ రెండు పార్టీల ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే రాజకీయాలు తలకిందులు అవుతాయని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్, బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కలిపితే 41.07. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతం 25.02 మాత్రమే.. 2018లో బీఆర్ఎస్+బీజేపీ ఓట్ల శాతం 53.88. అదే.. కాంగ్రెస్‌కు ఓట్ల శాతం 28.04 మాత్రమే. 2023లో బీఆర్ఎస్+బీజేపీకి ఓట్లను కలిపితే మొత్తం పోలైన ఓట్లలో 51.25 శాతం. అదే కాంగ్రెస్ ఓట్ల శాతం 39.4. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్+బీజేపీ ఓట్ల శాతం 51.76. ఈ లెక్కలను పరిశీలిస్తే.. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీచేసి ఉంటే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉండేదన్న అంచనాకు రావొచ్చు.
publive-image

నో చెబుతున్న బీజేపీలోని ఆ ముగ్గురు..
ఇన్నాళ్లు కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న రీతిలో ఫైట్ చేసిన బండి సంజయ్, ఈటల రాజేందర్ తో పాటు కిషన్ రెడ్డి ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ ముగ్గురు నేతలు బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకించడంలో మాత్రం ఒక్కటైనట్లు సమాచారం. అయితే.. కేసీఆర్ ఏ క్షణంలో నిర్ణయం మార్చుకుంటారో ఎవరూ అంచనా వేయలేరు. ఈ విషయం బీజేపీకి అగ్రనాయకత్వానికి కూడా బాగా తెలుసు.

Advertisment
Advertisment
తాజా కథనాలు