RTV Exclusive: హైదరాబాద్ లో ఆ 56 చెరువులు మాయం.. ఎక్కడెక్కడ ఎంత మింగారంటే? హైదరాబాద్ లో గత 40 ఏళ్లలో ఏకంగా 56 చెరువులు కబ్జాకు గురయ్యాయని మీకు తెలుసా? ఇందులో కొన్ని చెరువులైతే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన Exclusive వివరాలను, శాటిలైట్ ఇమేజ్ లను RTV సంపాదించింది. ఆ షాకింగ్ వివరాలను తెలుసుకోవడానికి ఈ స్టోరీ చదవండి. By KVD Varma 15 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Lakes: హైదరాబాద్ లోని అంబర్ పేటలో బతుకమ్మ కుంట పేరిట ఒక చెరువు ఉండేది.. ఆ ప్రాంతం వారంతా బతుకమ్మ సంబరాలు అక్కడే జరుపుకునేవారు. ఇప్పుడు బతుకమ్మ కుంటలో గుంట జాగా కూడా మిగల్లేదు. కబ్జారాయుళ్లు ఆ చెరువును ఖతం చేసేశారు. పటాన్ చెరువులో ఓ చెరువును అయితే రెండు ముక్కలు చేసి మధ్యలో రోడ్డు కూడా వేసేశారు. అక్కడ అపార్ట్మెంట్లు కూడా వెలిశాయి. ఈ రెండు ఉదాహరణలు మాత్రమే.. హైదరాబాద్ లో ఇలా మొత్తం 56 చెరువులు మాయం అయ్యాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని చెరువల కబ్జాలపై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్.. కాలం మారింది.. ఆధునికత పెరిగింది.. లక్షల్లో ఉండే జనాభా కోట్లను దాటింది. దీంతో భూమికి డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తనది కాని భూమిపై కూడా కన్నేశారు వ్యాపారులు. దీంతో చెరువులు.. కాల్వలు.. ఆక్రమణ జరిగిపోయింది. ఒక ఊరు.. లేదా ఒక ప్రాంతం అని లేదు.. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోటా ఇదే పరిస్థితి. ఒక పట్టణంగా ఒకప్పుడు ఉండే ప్రాంతం తన చుట్టూ ఉన్న పల్లెల్ని తనలో కలిపేసుకుని నగరంగా.. మహానగరంగా ఎదుగుతూ పోవడం ఇప్పుడు వేగంగా జరుగుతోంది. అందుకు ఉదాహరణ మనం ఉంటున్న హైదరాబాద్ మహానగరం. ఆధునిక హైదరాబాద్ కు ముందు.. మూసీనదికి అటూ ఇటూ వ్యాపించిన నగరం.. ఇప్పుడు విశ్వనగరంగా తన చుట్టూ ఉన్న జిల్లాలన్నింటి నుంచి కొంత కొంత భాగాన్ని తనలో కలిపేసుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ, తన పరిధి విస్తరిస్తున్న కొద్దీ.. తన నీడలో బతకాలాని వస్తున్న ప్రజలు పెరుగుతున్న కొద్దీ.. హైదరాబాద్ లో భూదందా రెక్కలు విప్పుకుంది. కనపడిన ప్రతీ చెరువు.. కుంట అన్నీ నివాస స్థలాలుగా మారిపోయాయి. గతంలో వందల ఎకరాలకు సాగునీరు అందించి.. రైతన్న చిరునవ్వును తన పై వీచే చిరుగాలులతో పలకరించిన వందలాది చెరువులు చిరునామా కోల్పోయాయి. వేలాది మంది దాహాన్ని తీర్చిన చెరువులు ఇప్పుడు కలుష్యంతో విషపూరితమయ్యాయి. GHMC have permission in Lake buffer zone for building construction Hyderabad Disaster Response and Assets Monitoring and Protection(HYDRA) commissioner AV Ranganath says in Chandanagar GHMC have permission for construction in lake buffer zone in May 2023. Irrigation department… pic.twitter.com/33fn1jmDl0 — Sudhakar Udumula (@sudhakarudumula) August 12, 2024 అవును హైదరాబాద్ విశ్వనగరంగా పెరిగిపోయింది. కానీ, భూదందాల మాటున సాగునీరు.. తాగునీరు అందించిన చెరువులు కనిపించకుండా పోయాయి. మాయమైన చెరువుల లెక్కలు వింటే అయ్యో అనిపించక మానదు. ముందు ఆ లెక్కలు ఇక్కడ వివరంగా చూద్దాం. ఈ లెక్కలు కూడా కేవలం 56 చెరువులకు (56 Hyderabad Lakes) సంబంధించినవి మాత్రమే. ఇవి కాకుండా ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. అయితే, మూసీ పరిధిలోని చెరువులకు సంబంధించి 1979-2023 సంవత్సరాల మధ్యలో పరిస్థితిపై జరిపిన రిపోర్ట్ లోని అంశాలు ఇలా ఉన్నాయి.. స్టడీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే . . 1979-2023 మధ్య హైదరాబాద్ లోని 56 చెరువుల పరిస్థితిలో వచ్చిన మార్పుపై జరిపిన స్టడీ ఇది ఈ 56 చెరువుల మొత్తం విస్తీర్ణం 1979లో 40.35 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 16.09 చదరపు కిలోమీటర్లు మొత్తంగా ఏ 56 చెరువుల్లో కలిపి ఆక్రమణకు గురైన ప్రాంతం 24.26 చదరపు కిలోమీటర్లు. అంటే 60% కి పైగా. ఇంకా చెప్పాలంటే పాతికేళ్లలో మూడువంతుల చెరువులు అక్రమార్కుల ఆక్రమణలో కుచించుకుపోయాయి. మిగిలిన కొద్దిపాటి చెరువుల స్థలాలు కూడా కాలుష్య కారకాలతో నిండిపోయి పనికిరాని స్థితికి చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ (Hussain Sagar Lake): మొత్తం విస్తీర్ణం 1979లో 5.97చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 4.71 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 1.25 చదరపు కిలోమీటర్లు సరూర్ నగర్ చెరువు (Saroor Nagar Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.808చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.36 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.452చదరపు కిలోమీటర్లు మీరాలం చెరువు (Miralam Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 2.18 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 1.48 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.697 చదరపు కిలోమీటర్లు (32%) రామకృష్ణాపురం చెరువు (Ramakrishnapuram Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.764 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.22 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.544 చదరపు కిలోమీటర్లు(71%) సఫిల్ గుడ చెరువు (Safilguda Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.309చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.106 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.203 చదరపు కిలోమీటర్లు (66%) మిర్యాలగూడ చెరువు (Miryalguda Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 1.673 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.164 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 1.51 చదరపు కిలోమీటర్లు(90%) పీర్జాదిగూడ చెరువు (Peerzadiguda Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.422చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.113 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.309 చదరపు కిలోమీటర్లు (73%) నల్ల చెరువు (Nalla Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.832 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.208 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.624 చదరపు కిలోమీటర్లు(90%) పీర్జాదిగూడ చెరువు (Peerzadiguda Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.087చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.031 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.0569 చదరపు కిలోమీటర్లు (65%) పెద్ద చెరువు (Pedda Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 1.113 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.3448 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.769 చదరపు కిలోమీటర్లు(69%) Also Read: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం రామ చెరువు (Rama Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.263 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.177 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.086 చదరపు కిలోమీటర్లు (33%) చెంగిచెర్ల చెరువు (Chengicherla Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.335 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.157 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.178చదరపు కిలోమీటర్లు(53%) పెద్ద చెరువు (Pedda Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.593 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.172 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.421 చదరపు కిలోమీటర్లు (71%) కాప్రా చెరువు (Kapra Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.517 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.379 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.138 చదరపు కిలోమీటర్లు(27%) శుకుర్ నగర్ చెరువు (Shukur Nagar Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.231చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.189 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.043చదరపు కిలోమీటర్లు (18%) చెన్నాపురం చెరువు (Chennapuram Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.065చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.074 చదరపు కిలోమీటర్లు పెరిగిన విస్తీర్ణం : 0.009 చదరపు కిలోమీటర్లు(15%) దమ్మాయిగూడ చెరువు (Dammaiguda Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.221చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.143 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.078 చదరపు కిలోమీటర్లు (35%) దమ్మాయిగూడ లేక్ (Dammaiguda Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.193చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.070చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.123చదరపు కిలోమీటర్లు(64%) అన్నారాయన్ చెరువు (Annarayan Ceruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.248 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.109 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.139 చదరపు కిలోమీటర్లు (56%) నాగారం లేక్ (Nagaram Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.405 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.225 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.180 చదరపు కిలోమీటర్లు(45%) నాగోల్ చెరువు (Nagole Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.112చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.066 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.46 చదరపు కిలోమీటర్లు (41%) రాంపల్లి చెరువు (Rampally Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.682చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0. 491 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.191 చదరపు కిలోమీటర్లు(28%) బండ్లగూడ చెరువు (Bandlaguda Lake) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.351చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.060 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.309 చదరపు కిలోమీటర్లు (83%) సాయి నగర్ చెరువు (Sai Nagar Cheruvu) : మొత్తం విస్తీర్ణం 1979లో 0.304 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.121 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.183 చదరపు కిలోమీటర్లు(90%) కుంట్లూర్ పెద్ద చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 1.345 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.14 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 1.205 చదరపు కిలోమీటర్లు (90%) బాతుల చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 1.154 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.317 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.836 చదరపు కిలోమీటర్లు(72%) తుమ్మల కుంట : మొత్తం విస్తీర్ణం 1979లో 0.409చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.409చదరపు కిలోమీటర్లు (100%) అంటే పూర్తిగా కనుమరుగు అయిపొయింది . ఇంజాపూర్ చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.507 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.507 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 2.022 చదరపు కిలోమీటర్లు(80%) ఒవైసీ లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.076చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.042 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.034 చదరపు కిలోమీటర్లు (45%) గుర్రం చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.938 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.138 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.799 చదరపు కిలోమీటర్లు(85%) జల్ పల్లి లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.885చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.612 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.273 చదరపు కిలోమీటర్లు (31%) పల్లె చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.804 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.148 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.656 చదరపు కిలోమీటర్లు(82%) సలకం చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.37చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.111 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.258 చదరపు కిలోమీటర్లు (70%) ఫాక్స్ సాగర్ చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 1.992చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 1.544 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.448 చదరపు కిలోమీటర్లు(22%) కొంపల్లి లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.388చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.063 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.325 చదరపు కిలోమీటర్లు (84%) కొమ్మేపల్లి లేక్ 2 : మొత్తం విస్తీర్ణం 1979లో 0.241 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.029చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.212 చదరపు కిలోమీటర్లు(90%) గుండ్లపోచంపల్లి లేక్ 1 : మొత్తం విస్తీర్ణం 1979లో 0.478చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.173 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.305 చదరపు కిలోమీటర్లు (64%) ఖాజీగూడా చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.927 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.112 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.815 చదరపు కిలోమీటర్లు(88%) గుండ్లపోచంపల్లి లేక్ 2 : మొత్తం విస్తీర్ణం 1979లో 0.181చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.128 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.053 చదరపు కిలోమీటర్లు (30%) దూలపల్లి చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.613 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.149 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.464 చదరపు కిలోమీటర్లు(76%) దేవర యాంజాల్ చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.476 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.337 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.139 చదరపు కిలోమీటర్లు (29%) పోతయ్యపల్లి లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.094 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.240 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.146 చదరపు కిలోమీటర్లు(61%) హకీంపేట్ లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.073చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.073 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0 చదరపు కిలోమీటర్లు. ఈ చెరువు ఆకృతిలో మార్పు వచ్చింది . కానీ , విస్తీర్ణంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు . ఓల్డ్ అల్వాల్ పాండ్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.539 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.099చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.44 చదరపు కిలోమీటర్లు(82%) అల్వాల్ లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.480చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.104 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.376 చదరపు కిలోమీటర్లు (78%) రామాంతపూర్ చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.129 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.063 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.066 చదరపు కిలోమీటర్లు(51%) బాన్ చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.487చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.212 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.275 చదరపు కిలోమీటర్లు (57%) తూముకుంట లేక్: మొత్తం విస్తీర్ణం 1979లో 0.462 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.106 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.356 చదరపు కిలోమీటర్లు(90%) రామాంతపూర్ చెరువు 1 : మొత్తం విస్తీర్ణం 1979లో 0.034చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.209చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.175 చదరపు కిలోమీటర్లు (84%) యాప్రాల్ లేక్ : మొత్తం విస్తీర్ణం 1979లో 0.45 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.062 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.388 చదరపు కిలోమీటర్లు(86%) పీర్జాదిగూడ చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.080 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.025 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.055 చదరపు కిలోమీటర్లు (69%) కౌకూరు చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.307 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.109చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.198చదరపు కిలోమీటర్లు(64%) కప్పల చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.190చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.057 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.133 చదరపు కిలోమీటర్లు (64%) జిల్లెలగూడ లేక్: మొత్తం విస్తీర్ణం 1979లో 0.095 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.649 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.554 చదరపు కిలోమీటర్లు(85%) మంత్రాల చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 0.117 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.495 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 0.378 చదరపు కిలోమీటర్లు (76%) పెద్ద చెరువు : మొత్తం విస్తీర్ణం 1979లో 3.083 చదరపు కిలోమీటర్లు. 2023లో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 0.114 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురైన విస్తీర్ణం : 2.969 చదరపు కిలోమీటర్లు(96%) Also Read: Independence Day Special Story: కొడుకును పణంగా పెట్టి…భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! #hydra #hussain-sagar #hyderabad-lakes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి