KA Paul: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్

ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్.. తన ఎన్నికల ప్రచార పాటను విడుదల చేశారు. కాగా విశాఖ నుంచి పాల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీకి కుండా గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే.

New Update
KA Paul: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్

KA Paul Song: ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్.. తన ఎన్నికల ప్రచార పాటను విడుదల చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను విమర్శిస్తూ ఈ పాట సాగింది. ఏపీకి పాల్ ఎందుకు కావాలనే అంశాన్ని ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఈ పాటను రూపొందించారు. కాగా విశాఖ నుంచి పాల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీకి కుండా గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే.

విశాఖను రాజధానిగా చేస్తా..

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను విశాఖ నుంచి ఎంపీ గా గెలిపించి పార్లమెంట్ పంపిస్తే ఏపీలో గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీరుస్తానని కేఏ పాల్ అన్నారు. 10 ఏళ్లు ఏపీకి రాజధాని లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ చేశారని ఫైర్ అయ్యరు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ఏపీకి రాజధానిగా విశాఖను ప్రకటిస్తానన్నారు. అలాగే ఏపీలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగిపోయారని.. వారందరికు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏపీతో పాటు దేశాన్ని కూడా ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ గా ఉంచుతననని పేర్కొన్నారు.

ALSO READ: సీఎంపై రాయి దాడిలో ఇరికించేందుకు కుట్ర.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ పై బాంబ్ పేల్చిన కేఏ పాల్..

ఆర్టీవీ అన్‌సెన్సార్డ్‌లో పాల్గొన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డేంజర్ లో ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి గండం ఉందని అన్నారు. రేవంత్ ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్‌లోని నలుగురు నేతలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీ కాపాడుకోవాలంటే తెలంగాణ ప్రజలకు చేస్తానని చెప్పిన హామీలను అమలు చేయాలని అన్నారు. కేసీఆర్ కళ్లు నెత్తికెక్కడం వల్లే ప్రజలు ఆయన్ను ఓడగొట్టారని.. తెలంగాణ ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ని సీఎం పదవి నుంచి ఎవరు తొలిగించాలని కుట్రలు చేస్తున్నారో తెలుసుకోవాలంటే కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు