JD Lakshminarayana : అది మా డీఎన్ఏలో లేదు.. వాళ్లంతా సంఘవిద్రోహ శక్తులే : RTVతో జేడీ!

మాజీ పోలీస్ అధికారి, 'జై భారత్' పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీ రాజకీయపరిణామాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంఘవిద్రోహ శక్తులు తనను చంపేందుకు కుట్ర చేశాయన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
JD Lakshminarayana : అది మా డీఎన్ఏలో లేదు.. వాళ్లంతా సంఘవిద్రోహ శక్తులే : RTVతో జేడీ!

JD Lakshminarayana With RTV : మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం 'జై భారత్' (Jai Bharat) నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయపరిణామాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంఘవిద్రోహ శక్తులు తనను చంపేందుకు కుట్ర చేశాయని, ఓట్లు చీల్చి ఏవరికో మేలు చేసు బుద్ది తమ డీఎన్ఏలో లేదన్నారు.

ఎవరినో ఆకర్షించేందుకు కాదు..
ఈ మేరకు ఏపీ (Andhra Pradesh) లో తమ పార్టీ మెజార్టీ సీట్లు గెలవబోతున్నందనే నమ్మకంతోనే ఉన్నామని చెప్పారు. అదే దిశగానే నాలుగు నెలలుగా ప్రజల్లోకి వెళ్లి తాము క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. అలాగే' జై భారత్' పార్టీ ఎవరినో ఆకర్షించేందుకు, సంతృప్తి పరిచేందుకు స్థాపించలేదని చెప్పారు. మిగతా నాయకుల్లాగా ఇష్టారీతిన తిట్టుకోవడం, ప్రజలను మోసచేయడం వంటి వాటికి తమ పార్టీ పూర్తి వ్యతిరేఖమన్నారు. అలాగే మిగతా పార్టీల్లాగా తాము ఓటుకు డబ్బు ఇవ్వలేదని, అది తమ పార్టీ విధానం కాదన్నారు. ఇక తనకు ప్రాణహాని ఉందనే కంప్లైట్ చేసిన అంశంపై మాట్లాడుతూ.. సంఘవిద్రోహ శక్తులు, వాళ్లకు మద్ధతుగా ఉండే రాజకీయ నాయకులు తనను హతమార్చేందుకు కుట్ర చేస్తున్నట్లు సమాచారం రావడంతోనే ముందస్తు జాగ్రత్త పడ్డానని తెలిపారు. ఏ పార్టీకీ కొమ్ముకాయని ఆర్టీవీలాంటి మీడియాలుండాలని కోరారు.

Also Read : ఆస్థి మొత్తం పెట్టి సినిమా తీశారు.. కట్ చేస్తే జరిగింది ఇది..!

వైసీపీకి మేలు చేసేందుకే పార్టీ..
అలాగే మంచి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియాలుంటే తాము, తమ పార్టీ అనతికాలంలోనే సక్సెస్ అవుతుందన్నారు. వైసీపీ (YCP) కి మేలు చేసేందుకే పార్టీ పెట్టారనే ఆరోపణలను ఖండించారు. అసెంబ్లీలో తాము అడుగుపెట్టేందుకు రాజకీయంలోకి వచ్చామని, ఓటు చీల్చే అలవాటు తమ డీఎన్ఏలో లేదన్నారు. మంచి పాలన, రాష్ట్రాన్ని నెంబర్ స్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు. ఏ పార్టీతో పొత్తు ఆలోచనల లేదన్నారు. తాము స్వతంత్రంగా ముందుకెళ్లామని చెప్పారు. ఇక రాష్ట్రంలో అందరం కలిసి పనిచేద్దామనే ఆలోచనల లేని నాయకులున్నారని, అందరూ క్రెడిట్ కోసమే పనిచేస్తారని విమర్శలు చేశారు. పాలకుల గొడవల్లోనే రాష్ట్రం నాశనమైపోయిందన్నారు. రాష్ట్రంలో యువత పనిలేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక ఏపీలో 80 అసెంబ్లీ, 10 లోక్ సభ, తెలంగాణ (Telangana) లో 5 లోక్ సభ మొత్తం 95 స్థానాల్లో పోటీచేశామన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో పోటీచేస్తామని, తమ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. పవన్ కల్యాణ్ తో విబేధాలు, ఇతరత్ర పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు